నవంబర్లో హిమాచల్, డిసెంబర్లో గుజరాత్ ఎన్నికలు
న్యూఢిల్లీ,అక్టోబర్ 3: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. 182 స్థానాలు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 13, డిసెంబర్ 17 తేదీలలో రెండు దఫాల్లో ఎన్నికలు జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు నవంబర్ 4న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు డిసెంబరు 20 చేపట్టనున్నట్టు ఈసీ తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 17తోనూ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 10 తోనూ ముగియనున్నాయి.
Comments