Tuesday, October 2, 2012

గెలిచినా తప్పని నిష్క్రమణ...

రన్‌రేట్ లేక సెమీస్‌కు చేరని టీమిండియా..
కొలంబో,అక్టోబర్ 2:  ప్రపంచకప్ ట్వంటీ 20నుంచి భారత్ నిష్ర్కమించింది. సూపర్‌ఎయిట్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోవిజయం సాధించినప్పటికీ రన్‌రేట్ ప్రకారం సెమీస్‌కు చేరలేక ఇంటిముఖం పట్టాల్సివచ్చింది.  టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ -దక్షిణాఫ్రికాకు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రన్‌రేట్ ప్రకారం భారత్ సెమీస్‌కు చేరాలంటే 121 పరుగులకు సఫారీలను నియంత్రించాలి. అయితే సఫారీలను నియంత్రించడంలో టీమిండియా ఆటగాళ్లు విఫలమయ్యారు.  దక్షిణాఫ్రికా  19.5 ఓవర్లలో 151 పరుగులు చేసింది.  ప్లెస్సీ అత్యధికం గా 65 పరుగులు చెసి బారత్ సెమీస్ ఆశలపై నీళ్ళు చల్లాడు. దీనితో  గ్రూప్-1 నుంచి శ్రీలంక , వెస్టిండీస్‌లు సెమీస్‌కు అర్హత సాధించగా, గ్రూప్-2 నుంచి ఆసీస్, పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...