ట్వంటీ 20 ఫైనల్స్ లో శ్రీలంక
కొలంబో,అక్టోబర్ 4: ప్రపంచకప్ ట్వంటీ 20లో గురువారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 16 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంకేయులు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్థాన్ విఫలమైంది. ఓపెనర్లు హఫీజ్ (42), నజీర్ (20) పరుగులతో మంచి ఆరంభాన్నిచ్చినా, మిడిల్ ఆర్డర్ వైఫల్యం తో పాక్ 123 పరుగులకే పరిమితమయింది. చివర్లో ఉమర్ ఆక్మల్ 29 పరుగులతో రాణించినా అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఆరుగురు పాకిస్థాన్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. లంకేయులు పకడ్భందీగా బౌలింగ్ చేసి పాక్‌ను నిలువరించారు. శ్రీలంక బౌలర్లలో అత్యధికంగా హెరాత్ మూడు వికెట్లు తీయగా, మాథ్యూస్ , మెండిస్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి.
Comments