వెస్టిండీస్ షాక్...అసీస్ షేక్...
కొలంబో,అక్టోబర్ 5: ప్రపంచకప్ ట్వంటీ 20లో ఆసీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. విండీస్ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్ 131 పరుగులకే చేతులెత్తేసింది. జాన్ బాలీ 63 పరుగులు మినహా . మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి పాలైన ఆసీస్ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. దీంతో విండీస్ తొలిసారి ప్రపంచకప్ ట్వంటీ 20ల్లో ఫైనల్‌కు చేరింది. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్‌కు మూడు వికెట్లు లభించగా బద్రీ, పొలార్డ్‌లకు తలో రెండు వికెట్లు , నరైన్, శ్యామ్యూల్స్‌లకు చెరో వికెట్టు లభించింది. విండీస్ ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది.
Comments