చర్చలు జరిపా...తెలంగాణా వచ్చెస్తుంది: కె.సి.ఆర్.
న్యూఢిల్లీ,అక్టోబర్ 3: కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలఫ్రదంగా ముగిశాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. బుధవారం హైదరాబాదు బయలుదేరే ముందు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. పలువురు నేతలతో తాను తెలంగాణ అంశంపై చర్చించానని, త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. మీడియాకు తెలిసి కొందరితోనే భేటీ అయ్యానని కానీ, తెలియకుండా చాలామందితో చర్చించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వచ్చానన్నారు. గత నెల నాలుగో తారీఖున పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన కె.సి.ఆర్. పార్లమెంటు సమావేశాలు రెండు రోజులే జరిగినప్పటికీ అప్పటి నుండి నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయారు.
Comments