'దీపం' లబ్దిదార్లకు అదనపు సిలిండర్లు
హైదరాబాద్ , అక్టోబర్ 23: ప్రజలకు ప్రస్తుతం ఇస్తున్న ఆరు గ్యాస్ సిలిండర్లకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు సిలెండర్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే దీపం పథకం కింద కనెక్షన్లు ఉన్నవారికే ఈ అదనపు మూడు సిలిండర్లు లభిస్తాయని పౌర సరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్నా సబ్సిడీతో అదనపు సిలిండర్లు ఇవ్వలేమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
Comments