ముందంజలో మిట్ రోమ్నీ
వాషింగ్టన్,అక్టోబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగమైన తొలి బహిరంగ చర్చలో అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ముందంజలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ తాజా సర్వేలోనూ దూసుకుపోయారు. ఒబామాకు 45 శాతం మంది మద్దతు పలకగా, రోమ్నీకి 49 శాతం మంది మద్దతు పలికారు. అక్టోబర్ 3న జరిగిన చర్చ అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. అంతకుముందు జరిపిన సర్వేల్లో వెనుకబడి ఉన్న రోమ్నీ చర్చ తర్వాత ముందుకు దూసుకొచ్చారు.
Comments