Thursday, October 4, 2012

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడి :చర్యలు : రు. 51 కోట్ల జప్తు

హైదరాబాద్,అక్టోబర్ 4:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో  మనీలాండరింగ్ చట్టాల ఉల్లంఘనను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నిర్ధారించింది. ఈ మేరకు ఈడి 51 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులను జప్తు చేసింది.  తాము ఆస్తులు జప్తు చేసిన సంస్థలు కుట్రల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందాయని ఈడి వ్యాఖ్యానించింది. హెటిర్ డ్రగ్స్ కు చెందిన 35 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అలాగే జననీ ఇన్‌ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూములను కూడా జప్తు చేసింది. వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ సంస్థకు చెందిన 14.5 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాల భూమిని, 3 కోట్ల రూపాయల ఫిక్సెడ్  డిపాజిట్లను ఈడి జప్తు చేసింది. వైయస్ జగన్ అక్రమంగా ఆస్తులను సంపాదించుకోవడానికి ఈ సంస్థలు సహకరించాయని ఈడి ఆరోపించింది. జగన్‌తో పాటు మరో 73 మంది నిందితులపై కూడా ఈడి దర్యాప్తు సాగిస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...