Tuesday, October 2, 2012

ఆస్ట్రేలియాపై పాక్ విజయం,,,భారత్ కు సంకటం

కొలంబో,అక్టోబర్ 2:  ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ 20  టోర్నమెంట్  సూపర్ 8 రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ విజయం సాధించి సెమీఫైనల్ ఆశల్ని సజీవంగా ఉంచుకొంది. పాకిస్థాన్ నిర్ధేశించిన 150 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులకు చేసింది. దాంతో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హస్సీ  54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ తొలుత చేసిన  పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాకిస్థాన్ జట్టులో అత్యధికంగా నాసిర్ జెమ్ షెడ్ 55, కమ్రాన్ అక్మల్ 32, అబ్దుల్ రజాక్ 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్ 3, దోహర్తి, వాట్సన్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా కు ఈ ఓటమి వల్ల  ప్రమాదమేమీ లేదు. కానీ,  ఇందువల్ల భారత్‌ దక్షిణాఫ్రికాపై తప్పనిసరిగా మంచి రన్ రేటుతో గెలవాల్సి ఉంటుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...