Thursday, October 4, 2012

తెలంగాణ మార్చ్ తప్పించుకోడానికే కెసిఆర్‌ ఢిల్లీ డ్రామా-లగడపాటి

న్యూఢిల్లీ,అక్టోబర్ 4:   హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెస్  అధిష్టానం పెద్దల వద్ద ప్రతిపాదన పెట్టారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్ర విభజన చేయాలని కెసిఆర్ తనంత తానుగా ప్రతిపాదన పెట్టారనిఆయన అన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా జరిగిన విధ్వంసంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు 16 పేజీల నివేదిక సమర్పించిన తర్వాత లగడపాటి  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కెసిఆర్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలువలేదని, మిగతా కేంద్ర మంత్రులు మర్యాదపూర్వకంగానే కెసిఆర్‌తో మాట్లాడారని  అన్నారు. చర్చల కోసం కెసిఆర్‌ను ఎవరూ పిలువలేదని, తెలంగాణ మార్ర్చ్ ను తప్పించుకోవడానికే కెసిఆర్ ఢిల్లీ వచ్చారని, గడువు ముగియగానే హైదరాబాదుకు జారుకున్నారని, మళ్లీ చర్చలంటూ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ సాధ్యం కాదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సహా కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, సుశీల్ కుమార్ షిండే వంటివారు చెప్పినా చర్చలంటూ కెసిఆర్ బుకాయిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని, అందువల్ల తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని వెంటనే తేల్చి చెప్పాలని తాను హోం మంత్రిని కోరానని ఆయన అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. తెలుగు రాని మజ్లీస్ అధినేత ఓవైసీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటున్నారని, తెలుగు జాతికి చెందిన కొంత మంది గోడమీది పిల్లివాటంగా ఉన్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఉద్దేశించి అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...