ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్లర్ ఫైనల్‌కు సైనా
పారిస్, అక్టోబర్ 25: వైల్డ్ కార్డు ఎంట్రీ సాధించిన సైనా ఫ్రెంచ్ ఓపెన్‌లో తన జోరు కొనసాగిస్తోంది. రెండో రౌండ్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి సప్పిరి పై 21-16, 21-13 తేడాతో సైనా విజయం సాధించి క్వార్లర్ ఫైనల్‌కు చేరుకుంది. ఒలింపిక్ విజయం తర్వాత ఆడిన తొలి టోర్నీ డెన్మా ర్క్ ఓపెన్ లోనే చాంపియన్‌గా నిలిచి దూకుడు మీద ఉన్న సైనా నెహ్వాల్ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను కూడా నెగ్గి ఈ ఏడాది ఐ దో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది.
Comments