Friday, October 12, 2012

తెలంగాణపై షిండే మాటకే అజాద్ ఓటు...

హైదరాబాద్, అక్టోబర్ 12:  తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.  తెలంగాణ చాలా జఠిలమైన అంశమని  ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనే గాక, అందరితోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీకి ఎవరు వచ్చినా మాట్లాడుతామని ఆయన అన్నారు. మంత్రులు, శానససభ్యులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై రెండేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నామని , ఏకాభిప్రాయ సాధన  వరకు నిర్ణయం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు గానీ ఏకాభిప్రాయం రావడం లేదని ఆయన అన్నారు.ఎంపి, బీహార్, యుపి విభజన మాదిరిగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని అన్నారు. కాగా, తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని, ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమని కేంద్ర హోం మంత్రి షిండే రెండు రోజుల క్రితమే స్పష్టం చేసిన విషయం విదితమే.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...