Tuesday, October 16, 2012

జీవ వైవిధ్య పరిరక్షణకు 50 మిలియన్ డాలర్లు: ప్రధాని

హైదరాబాద్, అక్టోబర్ 16: జీవ వైవిధ్య సదస్సుకు నాయకత్వం వహించే రెండేళ్ళ కాలం లో భారత్  ఇందుకు సంభందించిన ప్రాజెక్ట్ పై 50 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని  ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్  చెప్పారు.  జీవ వైవిధ్య పరిరక్షణకు సంస్థాగత వ్యవస్థ పటిష్టతపై ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. హైదరాబాదులో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో మంగళవారం నాడు ప్రధాని పాల్గొన్నారు. జీవ వైవిధ్య ప్రాధాన్యత భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని  మన్మోహన్ సింగ్  అన్నారు.  జీవ వైవిధ్య ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు కూడా  గుర్తిస్తున్నాయని చెప్పారు. పర్యావరణ ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన క్రమంగా ఏర్పడుతోందన్నారు.  జీవ వైవిధ్యం పై 2010 లక్ష్యాలను చేరుకోలేక పోయామని,  ప్రకృతి నుండి కనుమరుగు అవుతున్న జంతువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పర్యావరణమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు వాడుతున్న విత్తనాల పేటెంట్ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. భారత దేశంలో 600 పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలు ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పశు సంపద కూడా  ముఖ్యమేనని  అన్నారు. 105 పేటెంట్ హక్కులపై భారతదేశం విజయం సాధించిందని,  వన్యప్రాణుల రక్షణ కోసం చట్టాలని కఠినతరం చేశామని చెప్పారు. సాంప్రదాయ పంటలను కాపాడుకోవాలన్నారు.  నగోయా ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. నగోయా ప్రొటోకాల్ ను భారత్ అమలులోకి తెచ్చిందని చెప్పారు. తొలుత జీవవైవిద్యానికి గుర్తుగా ప్రధాన మంత్రి పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...