Sunday, October 21, 2012

విజయమ్మ ' బైబిల్ ' వివాదం...

 హైదరాబాద్ , అక్టోబర్ 21:   వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాజకీయ పార్టీ సభలకు, సమావేశాలకు, యాత్రలకు బైబిల్ చేత పట్టుకొని వెళ్లడం
వివాదాస్పదమవుతోంది. విజయమ్మ రాజకీయ లబ్ధి కోసం బైబిల్ చేత పట్టుకొని వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు చేస్తోంది. తాజాగా, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో విజయమ్మ బైబిల్ చేబూనటం వివాదస్పదమైంది. రాజకీయ కార్యక్రమాలకు  ఆమె బైబిల్‌ను తీసుకు రావడం ఒకరకంగా తెలుగుదేశం శ్రేణులు  ఆరోపిస్తున్నాయి. బైబిల్ చేతపట్టుకొని రాజకీయ యాత్రలకు రావడం ద్వారా విజయమ్మ ఒక  వర్గాన్ని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని  వారు విమర్శిస్తున్నారు. అయితే విజయమ్మ మాత్రం బైబిల్ రాజకీయాలను ఖండించారు. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా బైబిల్‌ను తీసుకు వెళ్తానని, బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పారు.  తన భర్త దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మనుషులను ప్రేమించడమే తనకు నేర్పించారని చెప్పారు. తన భర్త చనిపోయి, తన కొడుకు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినందునే  తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. అయితే ఆమె ఈ వార్తలను ఖండించిన తర్వాత టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విజయమ్మ మత ప్రచారం చేసిందంటూ ఓ సిడిని విడుదల చేయడం సంచలనం రేపింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...