Tuesday, October 2, 2012

నవంబర్ 26న కేజ్రీవాల్ పార్టీ...విజన్ డాక్యుమెంట్ సిద్ధం ...

విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తున్న కేజ్రీవాల్ 
న్యూఢిల్లీ,అక్టోబర్ 2:  అవినీతిపై  పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. జన్ లోక్ పాల్ ఉద్యమంలో మరో పోరాటమే రాజకీయ పార్టీ స్థాపన అని,  నవంబర్ 26న పార్టీ పేరు ప్రకటిస్తామని  అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాజకీయ విప్లవంతోనే జన్ లోక్ పాల్ సాధ్యమవుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. 13 అంశాలతో పార్టీ ఎందుకు పెడుతున్నామో ప్రచారం చేస్తామని, స్వరాజ్ పార్టీ,  లేక లోక్ పాల్ పార్టీ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పార్టీ విజన్ డాక్యుమెంట్ ను మంగళవారం ఆయన  విడుదల చేశారు. అవినీతిని అంతం చేయటంతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే భూసేకరణ చేపడతామని, అందరికీ మంచి విద్యతో పాటు వైద్యాన్ని అందిస్తామన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను తిరస్కరించే అధికారంతో పాటు ఎన్నికైన అభ్యర్థులను వెనక్కి పిలవటం.... రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు అందిస్తామన్నారు.తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలెవరూ ఎలాంటి భద్రతను పెట్టుకోమని,  సర్కార్ బంగ్లాలో ఉండబోమని, సామాన్య ప్రజల్లాగే జీవిస్తామన్నారు.  ప్రజలను అడిగిన తర్వాతే అభ్యర్థులకు పార్టీ టిక్కట్లు ఖరారు చేస్తామన్నారు. తమకు చందాలిచ్చే వివరాలు ఎప్పటికప్పుడు వెబ్ సైట్ లో పెడతామని, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పోటీ చేసే అవకాశం ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...