Monday, October 1, 2012

ఎఫ్.డి.ఐ. లపై యుద్ధం చేస్తాం: మమత

న్యూఢిల్లీ, ,అక్టోబర్ 1:  మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టడానికి  సిద్ధపడుతున్నట్లు తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. యుపిఎ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెసు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ,  పార్లమెంటు సమావేశాల్లో తాము యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఎఫ్‌డిఐల విషయంలో యుపిఎ ప్రభుత్వం లక్ష్మణరేఖను దాటిందని వ్యాఖ్యానించారు. ఎఫ్‌డిఐల అనుమతి వల్ల ఉద్యోగాలు పోతాయని, లఘు పరిశ్రమలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆమె అన్నారు. జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
మద్దతిస్తాం: కరుణానిధి
మరోవైపు ,రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీర్మానం తీసుకువస్తే... తాము మద్దతిస్తామని డీఏంకే అధినేత కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ తీసుకునే నిర్ణయం కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలపై అంతగా ప్రభావం చూపదని కరుణానిధి అన్నారు.  ఎఫ్ డీఐలకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓటు వేస్తామన్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రధాని మన్మోహన్ నిర్ణయాలు తీసుకుంటారని కరుణానిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...