Sunday, October 21, 2012

కింగ్‌ఫిషర్ లెసైన్స్ నిలుపుదల

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు తాజాగా పౌరవిమానయాన డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఏ) షాకిచ్చింది. లెసైన్స్ (షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్-ఎస్‌వోపీ) ను నిలుపుదలచేస్తూ (సస్పెన్షన్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తిరిగి ఆదేశాలు జారీ దీనితో చేసేవరకూ సస్పెన్షన్ అమలులో ఉంటుందని పౌరవిమానయాన శాఖ అధికారులు పేర్కొన్నారు. వెరసి తొమ్మిదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కింగ్‌ఫిషర్... తొలిసారి విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిలో పడింది. మూడు వారాలుగా లాకౌట్‌లో కొనసాగుతున్న కంపెనీ ఇటు ఆర్థికంగానూ, అటు నిర్వహణపరంగానూ ఎలాంటి ఆచరణీయ ప్రణాళికనూ సిద్ధం చేయలేకపోవడంతో డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. లెసైన్స్ సస్పెన్షన్‌తో కింగ్‌ఫిషర్ నెట్‌వర్క్ తోపాటు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా జరిగే అన్ని రకాల బుకింగ్‌లూ నిలిచిపోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, భద్రతా చర్యలలో భాగంగా డీజీసీఏ కింగ్‌ఫిషర్ లెసైన్స్ ను నిలుపుదల చేసిందని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. ఇంజనీర్లు సమ్మెలో ఉన్నందున విమానాల నిర్వహణ, తత్సంబంధిత సేవలను చేపట్టడంలేదని తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...