అక్కినేని అమల అరెస్టు
ముంబై, అక్టోబర్ 8: చారిత్రక కట్టడం చార్మినార్ పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్లు కట్టినందుకు అక్కినేని అమలను పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ వద్ద అనుమతి లేకుండా ఏ విధమైన బ్యానర్లు కట్టకూడదని, అయితే అమల గ్రీన్‌పీస్ సభ్యులతో కలిసి ఈ రూల్ ను అతిక్రమించినందున అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.కాగా, అంతర్జాతీయ జీవ వైవిథ్య సదస్సు సందర్బంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి తాము ఈ ప్రదర్సన నిర్వహించినట్లు అక్కినేని అమల చెప్పారు. కేంద్రం 13 కోల్ బ్లాక్‌లకు అనుమతి ఇచ్చారని, బొగ్గు తవ్వకాలు గిరిజనులను, జంతువులను నిరాశ్రయులను చేస్తున్నాయని, జంతువుల మనుగడ బొగ్గు తవ్వకాల వల్ల దెబ్బ తింటోందని అమల మీడియాతో అన్నారు.
Comments