ధరల భారం మరింత పెంచే ప్రణబ్ బద్జెట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : బడ్జెట్‌లో ఎన్ని బడా ప్రణాళికలు, పద్దులు ఉన్నప్పటికీ సామాన్యు డు ఆశగా ఎదురుచూసేది ఆ ఒక్కదాని కోసమే. అదే ఆదాయపు పన్ను మినహాయింపు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సగటు ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆదాయపు పన్ను మినహాయింపును రూ.1.60 లక్షల కు పరిమితం చేస్తూ ప్రణబ్ గత విధానాన్నే కొనసాగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.6 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం గలవారు 10 శాతం, రూ.5-రూ.8 లక్షల మధ్య ఆదాయం గలవారు 20 శాతం, రూ.8 లక్షల పైన ఆదాయం గలవారు 30 శాతం పన్ను చెల్లించవలసి వుంటుంది. అయితే గత ఏడాది బడ్జెట్‌లో పన్ను చెల్లింపు కోసం ప్రవేశ పెట్టిన కొత్త విధానం స్థానే ప్రణబ్ ఈ సారి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపులు మరింత సరళతరం కానున్నాయి. ఇప్పటివరకూ కఠినమైన అప్లికేషన్ ఫారమ్‌ను ఎత్తివేసి సరళతరంగా అందరికీ అందుబాటులో ఉండే రెండు పేజీల సరళ్-2 ఫారమ్ ప్రవేశపెడుతున్నట్లు ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో దశల వారీగా ఐటి రిటర్న్స్ దాఖలును కంప్యూటరీకరించను న్నట్లు ప్రణబ్ ముఖర్జీ...