శ్రీశైలం వద్ద లోయలో పడిన బస్సు
హైదరాబాద్,ఫిబ్రవరి 4: శ్రీశైలం చెక్‌పోస్టు వద్ద ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తోపాటు మరో మహిళ మృతి చెందింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏలూరు నుంచి బయలు దేరిన టూరిస్టు బస్సు శ్రీశైలం దగ్గరకు రాగానే ఘాట్ రోడ్డుపై మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Comments