హైదరాబాద్ లో ‘పులి’

పవన్‌కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ‘పులి’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ చిత్రం పెద్ద హిట్ కావడంతో ఇపుడు ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రానికి పనిచేస్తున్న కెమెరామెన్ బినోద్ ప్రధాన్‌ఎన్నో విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వ్యక్తి కావడంతో ‘పులి’ని తెరపై ఆవిష్కరంచడంలో తన విజువల్ మాయాజాలంతో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయగరని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్నం దిస్తున్న ఎఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కనకరత్న మూవీస్ బ్యానర్‌పై శింగనమల రమేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిఖిషాపటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ సంచలన నటి ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తిస్తుండటం ఈచిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే ఈచ్రితం టాకీ పార్ట్ ముంబాయి, యుఎస్‌ఎ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఇపుడు ఇన్ డోర్ సన్నివేశాలను హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే పాటల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు సమాచారం!
Comments