సంగీతం వినిపించే చీర

అనంతపురం,ఫిభ్రవరి 9: మహిళా సంగీత ప్రియులు సంగీతం వినడానికి చీరలోనే సంగీతాన్ని వినేలా వినూత్నమైన చీరను అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన డిజైనర్ మోహన్ రూపొందించారు. ఈ చీరను శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ చీరలో కంటికి కనిపించని వైరింగ్, మ్యూజిక్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆమర్చారు. రీచార్జ్ సౌకర్యం కూడా ఉన్న ఈ చీర కొంగుపై మ్యూజిక్ ఆపరేటింగ్ స్విచ్‌ను అమర్చారు. ఆరుదుగా లభించే స్వరాసఖి జాతిరాళ్లను చీరలో అమర్చినట్లు డిజైనర్ తెలిపారు. ఈ చీర ఖరీదు రూ. 25 వేలుగా నిర్ణయించారు.
Comments