నిర్మాణంలో ఉన్న భవనం కూలి 13మంది దుర్మరణం
హైదరాబాద్,ఫిభ్రవరి 5: నగరంలోని నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం శుక్రవారం కుప్పకూలింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, మరి పలువురు శిధిలాల కింద చిక్కుకుని వుంటారని అందోళన చెందుతున్నారు. భవనం పక్కనే ఉన్న బ్రిలియంట్ పాఠశాల పాఠశాల కాంపౌండ్ వాల్ పాక్షికంగా దెబ్బతింది. దీంతో ముందు జాగ్రత్తగా విద్యార్థులను బయటకు పంపించారు. భవనం కూలిన ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంభందించి ముగ్గురు మునిసిపల్ అధికారులను సస్పెండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రభుత్వం ప్రకటించింది.
Comments