Posts

గెలిపించిన కోహ్లీ

కొలంబో,సెప్టెంబర్ 30:  ప్రపంచ కప్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్   విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్  19.4 ఓవర్లకు 128 పరుగులు  చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ 17 ఓవర్లలో  రెండు వికెట్లు నష్టపోయి 129 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించింది.  కోహ్లీ 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెహ్వాగ్ 29 పరుగులు చేశాడు. రజా హసన్, షాహిద్ అఫ్రిది చెరో వికెట్ తీసుకున్నారు.  

ఉద్రిక్తత మధ్య సాగరహారం

Image
హైదరాబాద్,సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ... టి. జె.ఎ.సి. ఆదివారం నిర్వహించిన తెలంగాణ మార్చ్ ఉద్రిక్తతల మధ్య సాగింది.   తెలంగాణ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు నెక్లెస్ రోడ్డు కవాతుకు తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, తెలంగాణ కాంగ్రెసు, తెలంగాణ తెలుగుదేశం పార్టీలు, పలు ప్రజా సంఘాలు తెలంగాణ మార్చ్ కు మద్దతిచ్చాయి. నెక్లెస్ రోడ్డు, పివి ఘాట్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్  ప్రాంతాలు  జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావలసిన న సాగరహారం  రెండున్నర, మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.  వివిధ జిల్లాల నుండి వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు ఎక్కడికక్కడ కి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వైపుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు, తెలంగాణవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణవాదులు బారీకేడ్లు తొలగించి, ముళ్లకంచెలు పెకిలించి వేదిక వద్దకు ర్యాలీగా వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు బాష్పవాయువును, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేశారు. తెలంగాణవాదులు కూడా పో...

జీశాట్-10 ప్రయోగం విజయవంతం...

Image
హైద‌రాబాద్, సెప్టెంబర్ 29:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం నిర్వహించిన  జీశాట్-10 ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం వేకువ జామున 2.48 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీశాట్-10 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఇది ‘ఇస్రో’ చేపట్టిన 101వ ప్రయోగం కాగా, జీశాట్-10 ఉపగ్రహం ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైనది. దీని బరువు 3400 కిలోలు. అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించే రాకెట్ పరిజ్ఞానం ‘ఇస్రో’ వద్ద లేకపోవడంతో, దీనిని ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. ఉపగ్రహం తయారీ సహా ఈ ప్రయోగానికి మొత్తం రూ.750 కోట్ల ఖర్చు అయింది. ముందుగా నిర్ణయించినట్లే 30.45 నిమిషాల్లో ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. జీశాట్-10 ఉపగ్రహంలో మొత్తం 30 ట్రాన్స్ పాండర్లను అమర్చారు. ఈ ప్రయోగం ఈనెల 22న జరగాల్సి ఉండగా, ఏరియన్-5 రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, వారం రోజులు వాయిదా పడింది. 

గణేశ నిమజ్జనం ప్రశాంతం...

Image
హైద‌రాబాద్, సెప్టెంబర్ 29:  జంట నగరాలలో గణేశ నిమజ్జనోత్సవం శనివారం ప్రశాంతంగా ముగిసింది.  జంట న‌గ‌రాల్లో  వివిధ ప్రాంతాల నుంచి  వినాయ‌క విగ్రహాలను భారీ ఊరేగింపులతో  ట్యాంక్‌బండ్ వ‌ద్దకు తీసుకు వచ్చి హుస్సేన్ సాగ‌ర్‌లో నిమజ్జనం చేశారు.భారీ బందోబ‌స్తు న‌డుమ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా శాంతియుతంగా గ‌ణేశ  నిమ‌జ్జనోత్సవం జ‌రిగింది. ఆదివారం తెలంగాణ మార్చ్ ను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనోత్సవ వేడుకలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఖైరతాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి  నిమ‌జ్జనోత్సవం  తెల్లవరు ఝామున 2.35 నిమిషాల‌కు పూర్తైంది. హుస్సేన్ సాగ‌ర్‌లో తెల్లవారు జాము వర‌కూ.. సుమారు 3 వేల విగ్రహాలు నిమ‌జ్జన‌మయ్యాయి.

ఫిడే చెస్ టోర్నీ చాంపియన్‌గా కోనేరు హంపి

Image
అంకారా (టర్కీ),సెప్టెంబర్ 29:  తెలుగుతేజం కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చివరిదైన 11వ రౌండ్లో గ్రాండ్ మాస్టర్ హంపి పోలెండ్‌కు చెందిన మోనిక సాకోపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.  టోర్నీ ముగిసే సమయానికి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.  ఈ టోర్నీ మొత్తంలో హంపి ఏడు విజయాలు సాధించి, ఓ గేమ్‌లో ఓటమిపాలైంది. మూడు గేమ్‌లు డ్రా చేసుకుంది. ఈ విజయంతో హంపి ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లతోపాటు 40 బోనస్ పాయింట్లు చేరాయి.రూ. 4.43 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మొత్తం 14 అంతర్జాతీయ రేటింగ్ పాయింట్లు దక్కించుకున్న హంపి ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి చేరింది. 

హడలెత్తించిన అసీస్...సూపర్ ఎయిట్‌లో శుభారంభం

కొలంబో,సెప్టెంబర్ 28: ప్రపంచకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి సూపర్ ఎయిట్‌లో శుభారంభం చేసింది.   మాజీ చాంపియన్ భారత్‌ పై ఆసీస్ కేవలం 15 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించి గెలుపు స్వంతం చేసుకుంది. 141 పరుగుల విజయలక్ష్యాన్ని   ఆసీస్ కేవలం ఒక వికెట్ టు మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. వార్నర్ 63 పరుగులు చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే తడబడింది. గంభీర్(17) అనవసరపు రనౌట్‌తో ఆరంభమైన భారత్ పతనం  కడదాకా  కొనసాగింది. యువరాజ్ (8), కోహ్లి (15) , రైనా (26), ధోని (15) పరుగులు చేశారు. ఓ ఎండ్‌లో ఇర్ఫాన్ పఠాన్((31) ఆచి తూచి ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. గాయంతో మ్యాచ్‌కు దూరమైన సెహ్వాగ్ లేనిలోటు స్పష్టంగా కనబడింది. ఆసీస్ బౌలర్లలో వాట్సన్ మూడు వికెట్లు తీయగా, కమ్మిన్స్ రెండు, స్టార్క్‌కు ఒక వికెట్టు లభించింది.

సూర్య కిరణ్-2లో సైనా నెహ్వాల్‌

Image
హైదరాబాద్,సెప్టెంబర్ 27: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జెట్ ఫైటర్ విమానం సూర్య కిరణ్-2లో విహరించింది. షూటర్ అభినవ్ బింద్రా తర్వాత జెట్ ఫైటర్‌లో ప్రయాణించిన క్రికటేతర క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ ఖ్యాతికెక్కింది. లండన్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ పతకం సాధించినందుకు గాను సైనాకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ అరుదైన అవకాశం కల్పించింది.  క్స్

నెక్లెస్ రోడ్‌పై తెలంగాణా మార్చ్

Image
హైదరాబాద్,సెప్టెంబర్ 27: ఆదివారంనాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు నెక్లెస్ రోడ్‌పై తెలంగాణా మార్చ్ నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించింది.  తెలంగాణ మంత్రుల అభ్యర్థన మేరకు తెలంగాణ జెఎసి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వానికి రాసిన  లేఖ పై  ప్రభుత్వం ఈ అనుమతి మంజూరు చేసింది. అయితే రెండు రోజుల మార్చ్ కి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం త్రోసిపుచ్చింది. తెలంగాణ మార్చ్ ను శాంతియుతంగా జరుపుతామని జెఎసి హామీ ఇచ్చినట్లు మంత్రి జానారెడ్డి తెలిపారు.

జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 28:  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే శుక్రవారం అక్టోబర్ 5 వరకు  వాయిదా వేసింది.  తమ తరపు న్యాయవాది మారారని... విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తి మేరకు  అత్యున్నత న్యాయస్థానం విచారణను  వాయిదా వేసింది.  

బాబు తెలంగాణా లేఖ పై సీమ నేత బైరెడ్డి గరం...పార్టీకి రాం రాం...

Image
హైదరాబాద్,సెప్టెంబర్ 27:  తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే అభ్యంతరం లేదని  కానీ రాయలసీమ అంటే చిన్న చూపు ఎందుకని  బైరెడ్డి మండిపడ్డారు. తనకు రాజకీయాల కన్నా రాయలసీమ ప్రయోజనాలే ముఖ్యమని బైరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు అవ్వడానికి రాయలసీమను ఉపయోగించుకుంటున్న నేతలు ఆ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ నాలుగు జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 40 రోజులపాటు రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర చేస్తానని ఆయన తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన అభిమానంతో టిడిపిలో చేరానని, అప్పటి నుండి పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశానని చెప్పారు. నాడు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటే ఇప్పుడు చంద్రబాబు చెయ్యెత్తి జైకొట్టు తెలంగాణా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాటి సిద్ధాంతాల కోసమే తాను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఆధ్వర్యంలో పని చేశానని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనకు ఓకే చెప్పి స...

తెలంగాణాపై బాబు కప్పదాటు లేఖ...

హైదరాబాద్,సెప్టెంబర్ 26:  తెలంగాణ అంశంపై ఒక స్పష్టతను ఇస్తానని  చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చివరకు తుస్సుమనిపించారు. తెలంగాణ అంశాన్ని తేల్చటానికి తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు రాసిన లేఖలో కోరారు. తెలంగాణ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని, 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయటానికి పథక రచన చేస్తున్నారని చంద్రబాబు ప్రధానమంత్రికి రాసిన లేఖలో విమర్శించారు. డిసెంబర్ 2009లో కేంద్ర హోంమంత్రి ప్రకటన అనంతర పరిణామాల్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్‌ను వేయగా, డిసెంబర్ 2010లో నివేదిక సమర్పించిందన్న విషయాన్ని ఆ లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. కేంద్ర హోంమంత్రి మళ్లీ అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదన్న విషయాన్ని ఇటీవలి కాలంలో స్వయంగా...
Image
బుధవారం 80వ పుట్టిన రోజు జరుపుకున్న ప్రధాని  మన్మోహన్ సింగ్ 

ఏకాభిప్రాయం తర్వాతే తెలంగాణ : అజాద్ పాత పాట

శ్రీనగర్,సెప్టెంబర్ 26:   తెలంగాణ అంశంపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్  శ్రీనగర్‌లో అన్నారు. ఏకాభిప్రాయానికి మరింత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకాభిప్రాయం తర్వాతనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై ఇంకా ఇరు ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందన్నారు. చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ అత్యంత క్లిష్టమైన సమస్య అన్నారు. మహారాష్ట్ర సంక్షోభం పై ఆజాద్ స్పందిస్తూ,  మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ యూపిఏ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారుడని  తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌తో కాంగ్రెసుకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు, ఎన్సీపికి కూడా ఎలాంటి విభేదాలు లేవన్నారు. అజిత్ తనపై వచ్చిన ఆరోపణల కారణంగానే పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

భద్రతా వలయంలో భాగ్యనగరం...

నిమజ్జనం...తెలంగాణా మార్చ్...జీవ వైవిధ్య సదస్సు...    హైదరాబాద్,సెప్టెంబర్ 26:  హైదరాబాదులో వినాయక నిమజ్జనానికి తెలంగాణ మార్చ్ సెగ తగిలింది. 30న తెలంగాణ మార్చ్  ను     దృష్టిలో పెట్టుకుని వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ  రాత్రి 11 గంటల లోపలే ముగించాలని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశించారు.  తెలంగాణ మార్చ్ కు అనుమతి లేదని ఆయన చెప్పారు. బయటివారు తెలంగాణ మార్చ్ లో పాల్గొనకూడదని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు  మార్చ్ ను వాయిదా వేసుకుంటే ఆ తర్వాత  అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. అయితే, మార్చ్ ను వాయిదా వేసుకోవడానికి తెలంగాణ జెఎసి నిరాకరించింది.  వినాయక నిమజ్జనానికి తమ మార్చ్ ఏ విధమైన విఘాతం కలిగించదని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. మరోవైపు మార్చ్  ను అడ్డుకోవడానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరానికి జిల్లా నుంచి వచ్చే మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టారు.  భద్రత  కోసం 20 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి హైదరాబాదులో జరిగే జీవ వైవిధ్య సదస్సు...

అలరించిన బాలు, చిత్ర సంగీత విభావరి

Image
అట్లాంటా, సెప్టెంబర్ 25: యూటీ ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో ఐదేళ్లుగా నిర్వహిస్తున్న తెలుగు బోధనా తరగతులకు కావలసిన నిధుల సమీకరణకు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం  ఏర్పాటు చేసిన, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పద్మశ్రీ చిత్ర ల  సంగీత విభావరి గత శనివారం సాయంత్రం డాలస్ లోని బ్లాక్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ లో ఘనంగా  జరిగింది. డాలస్ లో ఉంటున్న భారతీయులతోపాటు టెక్సస్ లోని ఇతర ప్రాంతాల నుండి, ఒక్లొహోమా నుంచి కూడా తెలుగు భాషాభిమానులు, సంగీతాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంగీత డోలికల్లో తేలియాడారు. జగదానందకారకా, ఉప్పొంగెలే గోదావరి పాటలతో మొదలుపెట్టి యమహో నీ యమాయమా, స్వప్నవేణువేదొ, మాటేమంత్ర్రమూ, తెలుసామనసా, రాసలీలవేళ మొదలైన హిట్ పాటలతో పాటు, అలనాటి మధురగీతాలైన ఏదివిలో విసిసిన పారిజాతమో, సువ్వేనా సంపెంగపువ్వుల నువ్వేనా, తదితర బాలు పాటలు అందరినీ మంత్రముగ్ధులను చేసాయి.యస్పీశైలజ, ఎస్.పి. చరణ్ కూడా మధుర గీతాలు ఆలపించారు.
Image
:  తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం జరిగిన  రథోత్సవం...

ఇప్పటికిప్పుడు తేల్చం.. తెలంగాణపై కుండ బద్దలు కొట్టిన వాయలార్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 25:  ఈ నెలాఖరులోగా తెలంగాణపైన, కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనంపై ప్రకటనలు వెలువడుతాయంటూ జోరుగా సాగిన ఊహాగానాలు తుస్సుమనేట్టే కనబడుతోంది. అధిష్టానం జాతీయ అంశాలతోనే బిజీగా ఉందని, తెలంగాణపై ఆలోచన చేయడం లేదని  కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి కుండ బద్దలు కొట్టేశారు.సోమవారం జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో  తెలంగాణపై చర్చించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై ప్రశ్నించగా, ఆ విషయం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే అడగాలన్నారు.  కెసిఆర్ తనను కలిశారని, తెరాస విలీనం చిన్న విషయం కాదని  ఆయన అన్నారు.

ఇరిగేషన్ స్కాం...మహరాష్ట్ర డిప్యూటీ సి.ఎం. రాజీనామా...

Image
ముంబై,సెప్టెంబర్ 25:  సాగునీటి ప్రాజెక్ట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తమ పదవికి రాజీనామా చేశారు.  అజిత్ పవార్ తన సమీప బంధువు, కేంద్ర మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపికి చెందినవారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపి భాగస్వామి. తాను అవినీతికి పాల్పడలేదని . పదవికి తాను స్వచ్ఛందంగానే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదిస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. మహారాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, అయితే, అదనంగా 0.1 శాతం ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత పదేళ్లలో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై చేసిన వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. మంత్రి పదవి రాజీనామా చేసినప్పటికీ అజిత్ పవార్ ఎన్సీపి శానససభా పక్ష నేతగా కొనసాగుతారు. అజిత్ పవార్ తనకు చెప్పే రాజీనామా చేశారని ఎన్సీపి అధినేత శరద్ పవార్ అన్నారు. తమ పార్టీ మంత్రులు రాజీనామా చేయబోరని, ప...

చంద్రబాబు జీవన్మరణ యాత్ర...!

హైదరాబాద్ ,సెప్టెంబర్ 24: తొమ్మిదేళ్ళ అధికారం కోల్పోయిన తరువాత తొమ్మిదేళ్ళ నుంచి ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  2014 ఎన్నికలలో పార్టీ ని గెలిపించే లక్ష్యంతో జీవన్మరణ  పోరాటానికి సిద్ధపడుతున్నారు.  ‘వస్తున్నా... మీకోసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను  అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంనుంచి ప్రారంభిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్లనాటి సుపరిపాలనను ప్రజలకు గుర్తు చేసేందుకే ‘వస్తున్నా... మీకోసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, యూపీఏలతో పాటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, ఎన్డీయే రెండూ బలహీనమవుతున్నాయని.. ప్రాంతీయపార్టీల బలం బాగా పెరుగుతోందని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఎప్పుడు ఏర్పడినా టీడీపీ కీలక భూమిక పోషించిందన్నారు. 2014 ఎన్నికల తరువాత దేశ రాజకీయాల్లో కీలక మార్పులుంటాయని ఆయన చెప్పారు.  తెలంగాణ అంశంపై తాను పార్టీలో అందరితో మాట్లాడుతున్నానని   చెప్పారు.     చంద్రబాబు ప్రతి రోజూ 1...

వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లకు ఉచిత రోమింగ్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 24:  వచ్చే ఏడాది నుంచి మొబైల్ ఫోన్లకు రోమింగ్ చార్జీలు తొలగిస్తున్నట్లు టెలికం మంత్రి కపిల్ సిబల్ సోమవారం వెల్లడించారు.  ఇంటర్నెట్‌పై నియంత్రణకు ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పారు. అయితే, ఇంటర్నెట్ కారణంగా తలెత్తుతున్న సమస్యల పరిష్కారంపై ఏకాభిప్రాయం మాత్రమే కోరుతున్నామన్నారు. ఇంటర్నెట్‌లోని కొన్ని అంశాల్లో భావప్రకటనా స్వేచ్ఛకు పూర్తి రక్షణ ఉంటుందని అన్నారు. టెలికం కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్పెక్ట్రమ్ వేలం కోసం నోటీసు ఆహ్వాన దరఖాస్తులపై (ఎన్‌ఐఏ) టెలికం శాఖ కసరత్తు జరుపుతోందని, ఇది పూర్తయ్యాక ఏకీకృత లెసైన్సు మార్గదర్శకాలపై పనిచేయనుందని తెలిపారు. ఏకీకృత లెసైన్సుల పని పూర్తయిన తర్వాత ఉచిత రోమింగ్‌పై విధి విధానాలను నిర్ణయిస్తామని వెల్లడించారు.