Posts

హ్యాపీ న్యూఇయర్...

Image
'వార్తాప్రపంచం' వీక్షకులకు నూతన సంవత్సర శుబాకాంక్షలు...

రెచ్చగొట్టే డ్రెస్ వేస్తే రేప్ చేస్తారా...!?

Image
హైదరాబాద్,డిసెంబర్ 31: పోలీసుశాఖ వార్షిక నివేదిక వివరాలను  మీడియాకు వెల్లడిస్తూ డీజీపీ  దినేశ్ రెడ్డి  మహిళల వస్త్రధారణ పై చేసిన కామెంట్ వివాదానికి కారణమైంది. అత్యాచారాలు పెరగడానికి మహిళల వస్త్రధారణ కూడా ఒక కారణమని డీజీపీ పేర్కొన్నారు. "నేరాల తీరును విశ్లేషిస్తే... మహిళలు పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకోవడం కూడా అత్యాచారాలకు ఒక కారణమని తెలుస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సల్వార్ కమీజ్, చుడీదార్‌లు వచ్చాయి. ఆధునిక వస్త్రధారణలో భాగంగా ధరిస్తున్న దుస్తులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. ఇది నేర విశ్లేషణలో వెల్లడైన  విషయం'' అని డీజీపీ తెలిపారు. ఇదే సందర్భంగా "నేరాల తీరును విశ్లేషిస్తే... మహిళలు పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకోవడం కూడా అత్యాచారాలకు కారణమని తెలుస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సల్వార్ కమీజ్, చుడీదార్‌లు వచ్చాయి. ఆధునిక వస్త్రధారణలో భాగంగా ధరిస్తున్న దుస్తులు రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. ఇది నేర విశ్లేషణలో స్ప ష్టమైన విషయం'' అని డీజీపీ తెలిపారు. ఏటేటా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, వారి వేష ధారణ ను కించపారచడం తమ  ఉద్దేశం కాద...

తమిళనాడు, పుదుచ్చేరిల్లో 33 మందిని బలిగొన్న ' థానే '

న్యూఢిల్లీ,డిసెంబర్ 31: తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లను వణికించిన  'థానే' తుఫాను 33 మందిని పొట్టన పెట్టుకుంది. మరో 21 మందిని గల్లంతు చేసింది. ఐదు వేలకుపైగా ఇళ్లను నేలమట్టం చేసింది. మూడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.  ఈ తుఫాను  శుక్రవారం ఉదయం 6.30-7.30 గంటల మధ్య పుదుచ్చేరికి ఆగ్నేయ దిశలో తీరం దాటి  ప్రస్తుతం బలహీనపడుతోంది.  థానే కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, పుదుక్కోట్టై, నాగపట్నం, తంజావూరు, పుదుచ్చేరిలతోపాటు రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 33 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కడలూరులోనే 21 మంది మరణించారు. చేపల వేటకు వెళ్లిన 21 మంది జాలర్లు గల్లంతయ్యారు. రాష్ట్రానికి గండం తప్పిందని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. తుఫాను తీరం దాటినా సహాయ చర్యలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతాయని  చెప్పారు.

నెల్లూరు జిల్లాలో' థానే 'కల్లోలం

Image
థానే తుపాను ప్రభావం వల్ల నెల్లూరులో భారీ వర్ష దృశ్యం   చెన్నైడిసెంబర్ 30:   థానే తుపాను శుక్రవారం  తెల్లవారుజామున పుదుచ్చేరి, తమిళనాడులోని కడలూరు మధ్య తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు మరికొంత సమయం పడుతుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ వ్యవస్థ చాలా చోట్ల దెబ్బతింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. తీర ప్రాంతాల్లోని స్కూళ్లు, విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలం వేనాడు, ఇరక్కం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. థానే తుపాను ప్రభావం నెల్లూరు జిల్లా మీద తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాలోని 13 తీరప్రాంత మండల...

ఇక పాస్ పోర్టులు చకచకా...

హైదరాబాద్,డిసెంబర్ 30: ఈ ఏడాది (2011లో) 4.90 లక్షల పాస్‌పోర్టులను జారీ చేసి రికార్డు నెలకొల్పామని సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు.  పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. తత్కాల్ దరఖాస్తులను మూడు రోజుల్లోనే పరిశీలించి పాస్‌పోర్టును జారీ చేస్తున్నామని శ్రీకర్‌రెడ్డి తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ప్రస్తుతం 200 దరఖాస్తులకు టోకెన్లు (స్లాట్స్) జారీ చేస్తున్నామని, దరఖాస్తుదారుల డిమాండ్ ఆధారంగా మరో 500 స్లాట్స్ ను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వారంరోజుల్లో ప్రతి నిత్యం 2,500 స్లాట్స్‌ను ఆన్‌లైన్ దరఖాస్తుదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. లోగడ తిరస్కృతికి గురైన దరఖాస్తుదారులు తిరిగి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకుని స్లాట్ పొందే విధానం అమలులో ఉండేదన్నారు. ఇకపై వీరు ఎలాంటి టోకెన్ అక్కర్లేకుండా మూడు రోజుల్లో నేరుగా కార్యాలయానికొచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆరు పాస్‌పోర్టు సేవాకేంద్రాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. వీటి నుంచి ఇప్పటివరకు 20 వేల దరఖాస్తులు అం...

లోక్ 'బాల్ ' తో ఆడుకున్న పెద్దలు...!

ఆమోదం లేకుండానే శీతాకాల సమావేశాలు వాయిదా న్యూఢిల్లీ,డిసెంబర్ 30: లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కిన లోక్‌పాల్ బిల్లు  అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్ మక వైఖరితో అటకెక్కింది. పెద్దల సభలో దీనిని గట్టెక్కించేందుకు యూపీఏకు తగిన బలం లేకపోవడంతో అర్ధరాత్రి దాకా చర్చ తో సాగదీసి ఆఖరి నిమిషంలో గందరగోళానికి 'తావిచ్చి' సభను ఈ సారికి నిరవధిక వాయిదా వేయించడంలో సఫలీకృతమైంద్. బిల్లు బలహీనంగా ఉందంటూ చర్చ సందర్భంగా విపక్షాలు ధ్వజమెత్తాయి. అయినా అధికార కూటమి సవరణలు, మార్పుచేర్పుల జోలికిపోకుండా బిల్లుపై చర్చను సాగదీసింది. సరిగ్గా ఓటింగ్ సమయం వచ్చేసరికి.. విపక్షాలు బిల్లుకు 187 సవరణలను ప్రతిపాదించాయని, వీటిని పరిశీలించేందుకు సమయం కావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బన్సల్ సభ చైర్మన్‌ను కోరారు. దీంతో గందరగోళం తీవ్రతరం కావడంతో చైర్మన్ హమీద్ అన్సారీ అర్ధరాత్రి 12 గంటలు దాటాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, లోక్‌పాల్ బిల్లు మూలన పడదని, వచ్చే సమావేశాల్లో సభ ముందుకు తీసుకొస్తామని కేంద్ర న్యాయ శాఖ సల్మాన్ ఖుర్షీద్ మీడియాకు చెప్పారు. చర్చలో  విపక్షాల సభ్యులు, అధికార పక్ష సభ్యు...

భగవద్గీత భద్రం...

Image
మాస్కో,డిసెంబర్ 28: భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు. ఉగ్రవాద సాహిత్యంగా ముద్ర వేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సైబేరియా టోమ్‌స్క్ కోర్టు  బుధవారం తోసిపుచ్చింది.  స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను, హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జి పిటిషన్‌ను సమీక్షించి, భగవద్దీతను నిషేధించాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చారు. స్టేట్ ప్రాసిక్యూటర్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కాన్  రష్యా యూనిట్ నాయకుడు సాధు ప్రియ దాస్ చెప్పారు.  

ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి తగ్గిన శిక్ష

Image
హైదరాబాద్ ,డిసెంబర్ 28: లోగడ తీవ్ర సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రత్యూష ప్రియుడిగా భావించిన సిద్ధార్థ రెడ్డికి కింది కోర్టు విధించిన శిక్షాకాలాన్ని హైకోర్టు తగ్గించింది. ప్రత్యూష 2002లో మరణించింది. తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష కూల్ డ్రింకులో విషం కలుపుకుని సేవించారని, దాని వల్ల ప్రత్యూష మరణించిందని వార్తలు వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందిన సిద్ధార్థ రెడ్డి మాత్రం బతికి బయటపడ్డారు. ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థ రెడ్డికి ఆరేళ్ల కారాగారవాసాన్ని విధించింది. దీనిపై సిద్దార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్లాడు. సిద్ధార్థ రెడ్డికి నాంపల్లి కోర్టు విధించిన ఆరేళ్ల శిక్షా కాలాన్ని హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది.  రూ. 50 వేల జరిమానా విధించింది. ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి బెయిల్‌పై బయటే ఉన్నాడు. 15 రోజుల్లో లొంగిపోవాలని హైకోర్టు సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ రెడ్డి 115 రోజులు జైలులో గడిపాడు. ప్రత్యూష తల్లి సరోజిని -హైకోర్టులో తమకు న్యాయం జరగలేదని ,హైకోర్టు తీర్పున...

దీక్ష విరమించిన హజారే

Image
ముంబై,డిసెంబర్ 28:  సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ముంబై లో చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్షను జ్వరం కారణంగా  వైద్యుల సలహాపై ఒక  రోజు ముందే బుధవారం సాయంత్రం  విరమించారు. బలహీన లోక్‌పాల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం దీక్ష ప్రారంభించారు. మూడు రోజులపాటు దీక్ష చేయాలని భావించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు రెండో రోజునే దీక్ష విరమించారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నియంతలు దేశాన్ని పాలిస్తున్నారని దీక్ష విరమించిన తర్వాత హజారే వ్యాఖ్యానించారు.

దడదడలాడిస్తున్న ‘ థానే '

విశాఖపట్నం,డిసెంబర్ 28:  బంగాళాఖాతంలో ఏర్పడిన ‘థానే’ పెను తుపానుగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశలో 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతయిన థానే రాగల 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి,  శుక్రవారం కడలూరు-శ్రీహరికోట మధ్య తీరం దాటే   అవకాశముంది. తుపాను ప్రభావంతో గురువారం నుంచి  సముద్రం తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని,  తమిళనాడు, దక్షిణకోస్తా, చిత్తూరు జిలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచరిక కేంద్రం తెలిపింది.  తుపాను  తీరం దాటే సమయంలో తీరం వెంట 90-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచవచ్చని , మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

తొలి ఇన్నింగ్స్ లో 282 పరుగులకు భారత్‌ ఆలౌట్

ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 179  మెల్‌బోర్న్,డిసెంబర్ 28: భారత్‌తో జరుగుతున్న తొలిటెస్ట్ లో బుధవారం  మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో  8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. మైక్ హస్సీ 79, పాటిన్‌సన్ 3 పరుగులతో క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ లో పాంటింగ్ చేసిన 60 పరుగులు తప్ప మిగితా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, జహీర్ 2, ఇషాంత్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో  282 పరుగులకు ఆలౌటైంది.

అక్కినేనికి భార్యా వియోగం

Image
హైదరాబాద్,డిసెంబర్ 28:  ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొద్దికాలంగా అన్నపూర్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 79 సంవత్సరాలు. అన్నపూర్ణ మృతితో అక్కినేని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. అక్కినేనితో ఫిబ్రవరి 18, 1949 తేదిన అన్నపూర్ణ వివాహం జరిగింది. అన్నపూర్ణకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు నాగార్జున, నిర్మాత వెంకట్ అక్కినేని అన్నపూర్ణ కుమారులు. 2009 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు దంపతులు వివాహ వజ్రోత్సవం జరుపుకున్నారు.అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అన్నపూర్ణ మృతికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. తన తల్లి మరణవార్తను తెలుసుకున్న సినీ నటుడు నాగార్జున హుటాహుటిన బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు.

న్యూయార్క్ లో రాజ్‌కపూర్ చిత్రాల ప్రదర్శన

Image
 న్యూయార్క్, డిసెంబర్ 28:  భారతీయ నట దిగ్గజం  రాజ్‌కపూర్ నటించిన సూపర్ హిట్  చిత్రాలు  అమెరికా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.  ‘రాజ్‌కపూర్ అండ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ సినిమా' ’ పేరిట ఇక్కడి  మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ (మొమా) ఆధ్వర్యంలో  ఈ  సినీ ప్రదర్శనను జనవరి 6 నుంచి 16 వ తేదీ వరకు పది రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన 35 మిల్లీమీటర్ల ప్రింట్లతో  ఈ చిత్రాలను లు ప్రదర్శిస్తారు. వీటిలో ఆవారా, బర్సాత్, బూట్ పాలిష్, జిస్ దేశ్ మే గంగా బెహ్‌తీ హై, శ్రీ 420, మేరా నామ్ జోకర్, బాబీ చిత్రాలున్నాయి. అలాగే, భారత్‌లో మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా రాజ్‌కపూర్ సాధించిన ఖ్యాతిని వివరిస్తూ కార్యక్రమం ప్రారంభంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు మొమా ప్రతినిధులు తెలిపారు. 

నాడు రాజీవ్...నేడు రాహుల్...

Image
న్యూఢిల్లీ,డిసెంబర్ 28: లోక్‌పాల్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలన్న రాహుల్ గాంధీ ప్రతిపాదన గతంలో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ బిల్లుకు రాజ్యాంగ హోదా ప్రతిపాదన మాదిరిగానే పార్లమెంటులో వీగిపోయింది. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిస్తున్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌జేడీ వంటి పార్టీలు ప్రతిపక్షంతో జతకలవడంతో తాజాగా లోక్‌పాల్ ‘రాజ్యాంగ (116వ) సవరణ బిల్లు’ లోక్‌సభ తిరస్కరణకు గురైంది. దీంతో దాదాపు 22 ఏళ్లక్రితం నాటి పరిస్థితి   మళ్లీ చోటు చేసుకుంది.  రాహుల్ తండ్రి, నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా 1989లో పంచాయతీరాజ్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలని ప్రతిపాదించగా, దానిని పార్లమెంటు తిరస్కరించింది.  ప్రభుత్వేతర పార్టీలన్నీ ఒక్కతాటిపై నిలిచి దానిని అడ్డుకున్నాయి. ఆ వెంటనే లోక్‌సభను రద్దుచేసిన రాజీవ్ ఎన్నికలకు వెళ్లగా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అయితే మళ్లీ 1991 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్ప్డు కూడా  లోక్‌పాల్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు తెచ్చిన సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి యూప...

యు.పి.ఎ. విజయమా...వైఫల్యమా...?

రాజ్యాంగ హోదా లేకుండా 7 సవరణలతో లోక్‌పాల్ బిల్లుకు  లోక్ సభ ఆమోదం రాష్ట్రాల్లో లోకాయుక్తల ఏర్పాటు వాటి ఇష్టం... రాజ్యసభ లో బిల్లు ఆమోదం  అనుమానమే...     న్యూఢిల్లీ,డిసెంబర్ 28:  అవినీతిని అరికట్టేందుకు  ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు మంగళవారం సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఆమోదం పొందినా.. కాంగ్రెస్‌కు అనూహ్యంగా ఎదురుదెబ్బే తగిలింది. లోక్‌పాల్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా దక్కేలా చేయడంలో మన్మోహన్ సర్కార్ విఫలమైంది. కోరల్లేని లోక్‌పాల్ బిల్లుతో ప్రయోజనం లేదని అటు అన్నా హజారే దీక్షకు దిగి అనారోగ్యం పాలైనా.. ఈ బలహీనమైన బిల్లుకు మేం మద్దతిచ్చేది లేదని బీజేపీ భీష్మించినా.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దానిని మాత్రం ఆమోదింపచేసుకోగలిగింది. సీబీఐను లోక్‌పాల్ పరిధిలోకి తేవడం లాంటి భారీ  సవరణలకు తలొగ్గలేదు. లోకాయుక్తలను ఏర్పాటు చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఇచ్చే సవరణతో మిత్రపక్షాల మద్దతు పొందగలిగింది. సాయుధ బలగాలను, తీర గస్తీ దళాలను లోక్‌పాల్ విచారణ పరిధి నుంచి తొలగిస్తూ సవరణలు చేసి బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం ప...

పరిటాల రవి హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్య

Image
హైదరాబాద్ ,డిసెంబర్ 27: విప్లవ దేశభక్త పులులు సంస్థ వ్యవస్థాపకుడు, పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్యకు గురయ్యాడు. హైదరాబాదులోని సుల్తాన్ బజార్‌ పోలీసు స్టేషన్ పరిధిలో గల బొగ్గులకుంట ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఐదుగురు గుర్తు తెలుయని వ్యక్తులు అతన్ని దారుణంగా హత్య చేశారు.  గోవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్నఆటోను  బైక్‌లపై ఇద్దరు వ్యక్తులు  వెంబడించారని, మరో ఇద్దరు కాపు కాశారని, ఐదుగురు దాడి చేసి చంపారని  పోలీసులు వివరించారు.  గోవర్దన్ రెడ్డితో పాటు ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పారిపోయినట్లు తెలుస్తోంది.  దుండగులు ఆటో డ్రైవర్‌ను బంధించి గోవర్ధన్ రెడ్డిని హత్య చేశారు. ఆటోలో పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రయాణించి దాడి సమయంలో పరారైన వ్యక్తి ఎవరనేది  ఇంకా తెలియ లేదు.

ఇండియా కోసం మరణిస్తా:అన్నా హజారే

Image
ముంబైలో మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభం  ముంబై,డిసెంబర్ 27: భారత ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని, తాను జీవించి ఇండియా కోసం మరణిస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లు బలహీనంగా ఉందని ఆరోపిస్తూ , ఇక్కడి ఎంఎంఆర్‌డిఎ మైదానంలో మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభించిన అన్నా హజారే భారీగా గుమికూడిన ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించారు. గుండె నిచ్చిన భారత దేశం కోసం ప్రాణాలనైనా అర్పిస్తానని ఆయన అన్నారు. దేశం కోసం తాను కుటుంబాన్నే వదిలేశానని, తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా తెలియదని, దేశం కోసం వివాహం కూడా చేసుకోలేదని ఆయన అన్నారు. మరణిస్తాననే భయం లేదని, పోరాడుతూ పోతానని ఆయన అన్నారు. తన జట్టు సభ్యులు దీక్ష విరమించాలని అడిగారని, తాను వారి మాటలు వినలేదని ఆయన చెప్పారు.ప్రజల మద్దతు వల్లనే రామ్ లీలా మైదాన్‌లో 12 రోజులు దీక్ష చేయగలిగానని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లును నీరు గార్చడం అన్నా జట్టును మోసం చేయడం కాదని, ప్రజలను మోసం చేయడమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏదో ఒక రోజు ప్రజలు ఎగిసిపడి ప్రభుత్వాన్ని శిక్షిస్తారని ఆయన అన...

భారత్ 214/3

మెల్‌బోర్న్,డిసెంబర్ 27: : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో  రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ద్రావిడ్ 68, నైట్ వాచ్‌మెన్ ఇషాంత్ శర్మ పరుగులేమి చేయకుండా క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆటలో సెహ్వాగ్, ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌లు అర్ధ సెంచరీలను నమోదు చేశారు.  అర్ధ సెంచరీ నమోదు చేసుకుని మంచి ఊపు మీద కనిపించిన సచిన్.. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అవుట్ కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. సచిన్ 98 బంతుల్లో 73 పరుగులు చేసి సిడిల్ బౌలింగ్లో  క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సెహ్వాగ్ 67, గంభీర్ 3 పరుగులు చేశారు.సెహ్వాగ్ 8 వేల పరుగుల క్లబ్‌లో చేరడం, అలెన్ బోర్డర్ 64 అర్ధ సెంచరీల రికార్డును సచిన్ అధిగమించడం రెండవ రోజు ఆటలో విశేషం.

రెడీ ఫర్ కరెంట్ షాక్...!

హైదరాబాద్,డిసెంబర్ 26:   విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీంతో చార్జీల పెంపునకు అనుమతి నివ్వాలంటూ విద్యుత్ నియంత్రణ మండలిని విద్యుత్ పంపిణీ సంస్థ( డిస్కం) కోరింది. ప్రతిపాదిత పెంపుతో గృహ, పరిశ్రమ, వాణిజ్య వినియోగదారులపై రూ.4,950 కోట్ల భారం పడుతుందని అంచనా. 100 యూనిట్లు పైబడి విద్యుత్ వాడే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. పెంచిన చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది.

సంక్రాంతి తర్వాత మళ్ళీ తెలంగాణా సమరం: కేసీఆర్

హైదరాబాద్,డిసెంబర్ 26:  సంక్రాంతి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు విశ్రమించేదిలేదని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ భవన్‌లో తెలంగాణ లెక్చరర్ల సంఘం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ , తెలంగాణ ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకుందన్నారు. అవసరమయితే మరోసారి దీక్షకు దిగుతానన్నారు. ప్రజా ఉద్యమంలో ప్రజలదే విజయమన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. తాను మాట్లాడినా, మాట్లాడకపోయినా వార్తేనని కేసీఆర్ చమత్కరించారు. చంద్రబాబు వంచనలకు అంతేలేదని, వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది  ఆయనేనని అన్నారు. ఆంధ్రా హజారేనని చెప్పుకుంటున్న చంద్రబాబు సీబీఐ దర్యాప్తుపై ఎందుకు స్టే తెచ్చుకున్నారని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస సందర్భంగా వచ్చిన అవకాశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారవిరుచుకున్నారని అన్నారు. ప్రభుత్వంపై కనీస ఒత్తిడి కూడా తేలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.