పరిటాల రవి హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్య
హైదరాబాద్ ,డిసెంబర్ 27: విప్లవ దేశభక్త పులులు సంస్థ వ్యవస్థాపకుడు, పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి హత్యకు గురయ్యాడు. హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో గల బొగ్గులకుంట ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఐదుగురు గుర్తు తెలుయని వ్యక్తులు అతన్ని దారుణంగా హత్య చేశారు. గోవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్నఆటోను బైక్‌లపై ఇద్దరు వ్యక్తులు వెంబడించారని, మరో ఇద్దరు కాపు కాశారని, ఐదుగురు దాడి చేసి చంపారని పోలీసులు వివరించారు. గోవర్దన్ రెడ్డితో పాటు ఆటోలో ప్రయాణించిన వ్యక్తి పారిపోయినట్లు తెలుస్తోంది. దుండగులు ఆటో డ్రైవర్‌ను బంధించి గోవర్ధన్ రెడ్డిని హత్య చేశారు. ఆటోలో పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో పాటు ప్రయాణించి దాడి సమయంలో పరారైన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియ లేదు.

Comments