న్యూయార్క్ లో రాజ్‌కపూర్ చిత్రాల ప్రదర్శన
న్యూయార్క్, డిసెంబర్ 28: భారతీయ నట దిగ్గజం రాజ్‌కపూర్ నటించిన సూపర్ హిట్ చిత్రాలు అమెరికా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ‘రాజ్‌కపూర్ అండ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ సినిమా' ’ పేరిట ఇక్కడి మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ (మొమా) ఆధ్వర్యంలో ఈ సినీ ప్రదర్శనను జనవరి 6 నుంచి 16 వ తేదీ వరకు పది రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన 35 మిల్లీమీటర్ల ప్రింట్లతో ఈ చిత్రాలను లు ప్రదర్శిస్తారు. వీటిలో ఆవారా, బర్సాత్, బూట్ పాలిష్, జిస్ దేశ్ మే గంగా బెహ్‌తీ హై, శ్రీ 420, మేరా నామ్ జోకర్, బాబీ చిత్రాలున్నాయి. అలాగే, భారత్‌లో మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా రాజ్‌కపూర్ సాధించిన ఖ్యాతిని వివరిస్తూ కార్యక్రమం ప్రారంభంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు మొమా ప్రతినిధులు తెలిపారు.

Comments