Posts

తెలంగాణ వచ్చి తీరుతుంది: సుష్మా

కరీంనగర్, మే 31:   తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరంలో ఏర్పాటై తీరుతుందని బీజేపీ సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్షనాయకురాలు సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.కరీంనగర్‌లో  రాష్ట్ర  బి.జె.పి.ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పోరు’ సభలో సుష్మా ప్రసంగిస్తూ.. తెలంగాణ సంస్కతి, చరిత్ర చాలా గొప్పదన్నారు. నైజాం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఆమె నివాళులర్పించారు. అంతేకాక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు కూడా సుష్మా నివాళులర్పించారు. తెలంగాణ సాధనే బీజేపీ లక్ష్యమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం తెలంగాణ కోసం పోరాడుతునే వుంటామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు.

లోక్‌పాల్‌పై రాష్ట్రాలకు, రాజకీయపార్టీలకు లేఖ

న్యూఢిల్లీ,మే 31:  లోక్‌పాల్ బిల్లుపై వివిధ రాష్ట్రాలోని ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లేఖలు రాశారని కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలిపారు. ప్రధాన మంత్రిని, పార్లమెంట్ సభ్యులను, ఉన్నత న్యాయవ్యవస్థల్ని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలా అనే విషయంపై రాష్ట్రాల నుంచి, రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని సేకరించేందుకు లేఖ రాశారని ఆయన తెలిపారు. అంతేకాక ఉన్నత పదవుల్ని నిర్వహిస్తున్న వారిని లోక్‌పాల్ లేదా లోకయుక్తాపరిధిలోకి తీసుకురావాలా అని  లేఖలో అడిగినట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై పౌర సమాజంలోని సభ్యుల, రాజకీయ పార్టీల, నిపుణుల మధ్య ఏకాభిప్రాయం కుదురలేదన్నారు. ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరేలా ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

మరోసారి జూపల్లి రాజీనామా

హైదరాబాద్.మే 31: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌ను కలిసి మరోసారి రాజీనామా సమర్పించారు. మార్చి 3 తేదిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు జూపల్లి కృష్ణారావు రాజీనామా లేఖను పంపిచారు. అయితే జూపల్లి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. దాంతో గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించి, ఆమోదించాల్సిందిగా కోరారు.మంత్రులందరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు. 

రోశయ్యకు గవర్నర్ గిరీ...?

Image
హైదరాబాద్ ,మే 29:మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళిన రోశయ్య  మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించిన రోశయ్యకు గవర్నర్ పదవి  కట్టబెట్టే అన్శాన్న్ని చర్చిందుకే రోశయ్యను సోనియా ఢిల్లీకి అహ్వానించినట్లు చెబుతున్నారు.  రోశయ్య ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితిపై కాస్తా తీవ్రంగానే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియాకు ఆయన ఇటీవల ఓ లేఖ కూడా రాశారు. కాగా, హైదరాబాదులోని అమీర్‌పేట భూకుంభకోణం వల్ల రోశయ్య గవర్నర్‌గిరీకి ఆటంకాలు ఏర్పడతాయా అనేది అనుమానంగా ఉంది. ఈ కేసును పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కేసుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎసిబి కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఎసిబి కోర్టు రోశయ్య పేరును క్లియర్ చేయడానికి మరో వారం రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయనను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించే అవకాశాలున్నాయి.

‘మహంకాళి’ షూటింగ్‌లో గాయపడ్డ రాజశేఖర్

చెన్నై,మే 29:  ‘మహంకాళి’ చిత్ర షూటింగ్‌లో హీరో రాజశేఖర్ సోమవారం గాయపడ్డారు. గాయపడిన రాజశేఖర్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కుడి చేతికి, కన్నుకు గాయమైనట్టు సమాచారం. ఆయనకు ప్రమాదమేమి లేదని 15 రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. రాజశేఖర్ సతీమణి జీవిత దర్శకత్వంలో ‘మహంకాళి’ చిత్రం రూపొందుతోంది. కిల్‌పాక్ మెడికల్ కాలేజిలో ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

చిరంజీవి చిన్నల్లుడికి సుప్రీంలో చుక్కెదురు

న్యూఢిల్లీ,మే 29: వరకట్న వేధింపుల కేసులో చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పరస్పర అంగీకారం కోసం రెండు  కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కావున తన క్లయింట్ కు  బెయిల్ ఇప్పించాలన్న శిరీష్ తరపున న్యాయవాది అభ్యర్థనను జీఎస్ సింఘ్వీ, చంద్రమౌళి ప్రసాద్‌లతో కూడిన బెంచ్ తిరస్కరించింది. కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా 2007 సంవత్సరంలో హైడ్రామాతో శిరీష్ వివాహం చిరంజీవి కూతురు శ్రీజతో జరిగింది. అయితే అప్పటి పరిస్థితుల దృష్ట్యా శిరీష్ దంపతులు రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆతర్వాత శిరీష్ దంపతులు మీడియా కాన్ఫరెన్స్‌లో తమ పెళ్లిని చెడగొట్టేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే నాలుగేళ్ల తర్వాత నాటకీయంగా శిరీష్‌పై వరకట్న వేధింపుల కేసును తన తల్లితో కలిసి శ్రీజ దాఖలు చేసింది. ఈ కేసులో శిరీష్‌కు హైదరాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

గేల్‌ పై వెస్టిండీస్ బోర్డు వేటు

అంటిగ్వా,మే 29: బోర్డు మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్‌పై అనుచిత వాఖ్యలు చేసినందుకు విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ వేటు వేసింది. భారత్‌తో ప్రారంభం కానున్న సిరీస్‌లో ఒక టీ20 మ్యాచ్‌కు, మరో రెండు వన్డేలకు గేల్‌ను దూరంగా ఉంచుతూ వెస్టిండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా టీమ్, బోర్డ్ మేనేజ్‌మెంట్‌పై జమైకా రేడియోలో గేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం లేపాయి. దాంతో గేల్ నుంచి వివరణ కోరేందుకు సెలక్షన్ కమిటీ ముందు హాజరుకావాలని బోర్డు కోరింది. 

పార్టీని రక్షించుకోవడం కోసమే ఎన్‌టీఆర్‌పై తిరుగుబాటు

Image
మహానాడు లో బాబు వివరణ   హైదరాబాద్ ,మే 29:  తెలుగుదేశం పార్టీ వార్షిక సమావేశం మహానాడు ఆదివారం ముగిసింది. ఈ మహానాడులో 14 తీర్మానాలను ప్రవేశపెట్టినట్టు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఈ మహానాడును రైతులకు అంకితం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తెలుగుదేశం  పార్టీని రక్షించుకోవడం కోసమే ప్రజాస్వామ్య బద్దంగానే ఎన్టీయార్‌పై తిరుగుబాటు చేశానని.. 200 మంది ఎమ్యెల్యేలతో నాయకత్వ మార్పు చేశానని చంద్రబాబునాయుడు  ముగింపు ప్రసంగంలో అన్నారు.   దివంగత నేత ఎన్‌టీఆర్‌పై తిరుగుబాటు చేస్తాననుకోలేదని,  పార్టీ నాశనం కోసం ఓ దుష్టశక్తి ప్రయత్నించిందని.. దాన్ని అడ్డుకోవడం కోసమే ఎంటీఆర్కు  వ్యతిరేకంగా ఎదురు తిరుగాల్సి వచ్చిందన్నారు.  రాజకీయం వేరు.. బంధుత్వం వేరని అన్నారు. పార్టీలో తన కుటుంబం ఎన్నడూ తలదూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో చెప్పాల్సింది చెప్పా, కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.1995-2004 కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమని ఆయన అన్నారు. రైతుల కోసం అవిశ్వాస తీర్మానానికి సిద్ధమని.. అవసరమైతే ప్రభుత్వా...

అవిశ్వాస తీర్మానం పెట్టండి చూద్దాం....సి.ఎం. సవాల్

చిత్తూరు,మే 29:  దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని సీఎం స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానానికి ఎంత సంఖ్య కావాలో తెలియని వారు కూడా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు.  రాజకీయ లబ్ది కోసమే పార్టీలు ఎదురుదాడి చేస్తున్నాయని విమర్శించారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్ల భర్తీ

చిరు వర్గానికి మొండి చెయ్యి... వై.ఎస్.వివేకాకు నో చాన్స్... హైదరాబాద్ ,మే 29:   రెండు నెలలపాటు పెండింగ్‌లో ఉంచిన గవర్నర్ కోటా శాసనమండలి సభ్యుల నియామకాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఖరారు చేసింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తన కోటాలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎ.చక్రపాణి, డి.రాజేశ్వర్‌రావు, ఫారూఖ్ హుస్సేన్, రెడ్డెప్పరెడ్డి, అంగూరి లక్ష్మీశివకుమారిలను నామినేట్ చేశారు. గత మార్చి 29వ తేదీ వరకూ సభ్యులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలకు ఉద్వాసన పలికారు. మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డితో పాటు.. కాంగ్రెస్‌లో విలీనం కానున్న ప్రజారాజ్యం పార్టీకి కూడా అధిష్టానం మొండిచేయి చూపింది. ఐఎన్‌టీయూసీ నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్ కుమార్తె మజ్జి శారదకు బదులుగా ఇద్దరు కొత్త వారికి అవకాశం లభించింది. మార్చిలో పదవీ కాలం ముగిసిన శాసనమండలి మాజీ చైర్మన్ ఎ.చక్రపాణి, డి.రాజేశ్వర్‌రావులకు మాత్రమే మళ్లీ అవకాశం ఇచ్చారు. వాస్తవానికి నాలుగేళ్ల పదవీ కాలానికి నామినేట్ అయిన నలుగురు ఎమ్మెల్సీలు మార్చిలో పదవీ విరమణ చేసినా.. కడప లోక్‌సభ, పులివెందుల శాసనభ స్థానాలకు...

టైటిల్‌ నిలబెట్టుకున్న చెన్నై

చెన్నై,మే 29:  ఐపీఎల్-4 లో  చెన్నై తిరిగి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ధోని గ్యాంగ్ భారీ స్కోరు , కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్.. వెరసి చెన్నైను ఐపీఎల్-4 విజేతగా నిలిపింది. చెన్నై 58 పరుగుల తేడాతో బెంగళూర్ పై ఘన విజయం సాధించింది.  206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ వెటోరి సేన ఆదిలోనే కష్టాల్లో పడింది. గత బెంగళూర్ మ్యాచ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గేల్.. ఈ మ్యాచ్‌లో నిరాశపరిచి (0) పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో బెంగళూర్‌కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఇక ఛేదించడం తమ వల్ల కాదన్నట్టు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్‌కు చేరారు. అగర్వాల్(10), డివిలియర్స్ (18)), పోమర్‌బాక్ (2), వెటోరి (0), మిధున్ (11)లు వరుసుగా వికెట్లు సమర్పించుకోవడంతో బెంగళూర్ తొందరగానే చేతులెత్తేసింది. కోహ్లీ ఒక్కడే (35) పరుగులు చేసి ఫర్వాలేదనిపించుకున్నాడు. తివారీ (42) పరుగులతో కడ వరకూ క్రీజ్‌లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. బెంగళూర్ 147 పరుగులకే పరిమితమవ్వడంతో భారీ ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్టు తీయగా , జకాతీ రెండు, రైనా, బ్రేవోలకు తలో వికెట్టు దక్కింది.

విశ్వ విఖ్యాత నట సార్వభౌమా...జోహార్...

Image
మహానటుడు,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు 88వ  జయంతి సందర్భంగా ' వార్తాప్రపంచం ' ఘన నివాళి...ఎడిటర్

మహానాడు లో లోకేష్ ఫ్లెక్సీల పై హరికృష్ణ గరం...!

 బాబు దిద్దుబాటు యత్నం... ? హైదరాబాద్,మే 28:  నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు పెట్టిన నాయకులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా నాయకుడు విజయ్‌బాబును ఆయన మందలించారు. మహానాడు వేదికపై నారా లోకేష్ ఫ్లెక్సీని పెట్టి తన ఫ్లెక్సీని పెట్టకపోవడంపై రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు  సమాచారం అందిన నేపథ్యంలో ,తన కుమారుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు.  లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడం వంటి చర్యలను తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయడం, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు రాకపోవడం వంటి కారణాలతో చంద్రబాబు వెనక్కి తగ్గి దిద్దుబాటు చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎటువంటి తీర్మానాలు చేయవద్దని ఆయన సూచించారు. అనవసరమైన వివాదాలకు కారణం కావద్దని ఆయన అన్నారు. 

గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ ' నిప్పు '

Image
హైదరాబాద్: రవితేజ హీరోగా బొమ్మరిల్లు బ్యానర్ పై దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్న 'నిప్పు' చిత్రం షూటింగ్  హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రవితేజ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇచ్చారు. మామూలుగా గుణశేఖర్ సినిమాలు భారీతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. భారీ సెట్లు, భారీ ఖర్చు సినిమా నిండా కనపడతాయి. అయితే, ఈమధ్య కాలంలో తన సినిమాలను (అర్జున్, సైనికుడు, వరుడు) ఆ భారీతనం ఏమాత్రం కాపాడలేకపోయిన విషయాన్ని గుణసేఖర్  గ్రహించాడేమో... తాజాగా రూపొందిస్తున్న 'నిప్పు' సినిమాలో ఆ భారీతనానికి, భారీ సెట్స్ కు, గ్రాఫిక్స్ కు స్థానం ఇవ్వడం లేదని  దర్శకుడు గుణశేఖర్ స్వయంగా  చెప్పాడు. రవితేజ బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే, కొత్తదనంతో అతని పాత్ర సాగుతుందని  గుణశేఖర్ చెప్పారు. ఈ సినిమాకి ఆకుల శివ సంభాషణలు రాస్తున్నారు.  హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదట. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నామని  నిర్మాత వై.వి.ఎస్.చౌదరి చెప్పారు.

తెలంగాణా పై మార్పు లేని బాబు మాట

పరిష్కార బాధ్యత కాంగ్రెస్ దే... మాకు రెండు ప్రాంతాలు ముఖ్యం...  హైదరాబాద్,మే 27: తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నది కాంగ్రెసు పార్టీయేనని, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెసుదేనని ఆయన అన్నారు. పార్టీ మహానాడులో శుక్రవారం చేసిన అధ్యక్షోపన్యాసంలో ఆయన తెలంగాణపై విస్తృతంగా మాట్లాడారు. కానీ కొత్త విధానాన్ని ప్రకటించలేదు. బిజెపి, కాంగ్రెసు పార్టీలు జెండా పెట్టుకుని తెలంగాణ ఉద్యమాలు చేస్తే తమ పార్టీ మాత్రం జెండా పెట్టుకుని ఆందోళన చేయవద్దని అంటున్నారని ఆయన అన్నారు. తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెసుకు గానీ ఇతర పార్టీలకు గానీ లేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అది తమ తప్పు ఎలా అవుతుందని, సమాధానం చెప్పాలని కాంగ్రెసు పార్టీని అడుగుతున్నానని ఆయన అన్నారు.  రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాను ఏం చేయాలన్నా చేస్తానని ఆయన చెప్పారు.తెలుగు ప్రజలతో కాంగ్రెసు పార్టీ ఆడుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెస...

మహానాడు వేళ 'రామ ' భజన...

Image

వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత్ జట్టు

ముంబై,మే 27: : వెస్టిండీస్ తో   టెస్ట్ సిరీస్ కు  భారత్ క్రికెట్ జట్టుని ప్రకటించారు. ఈ జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. కెప్టెన్ గా ధోనీ, వైఎస్ కెప్టెన్ గా లక్ష్మణ్ ఉంటారు.  భజ్జీ , మునాఫ్, రైనా, అభినవ్ ముకుంద్, మురళీ విజయ్, ద్రవిడ్, కోహ్లీ, బద్రీనాద్, శ్రీకాంత్, అమిత్ మిశ్రా, ఇషాంత్, పార్ధీవ్ పటేల్ జట్టులో ఉన్నారు.  సచిన్ కు విశ్రాంతి ఇచ్చారు. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ

అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి  హైదరాబాద్,మే 26: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ. అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికైనట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సభ్యత్వం, ఎన్నికల నిర్వహణ సమన్వయకర్తగా పీఎన్‌వీ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొల్లి నిర్మలా కుమారి, యువజన విభాగం అధ్యక్షుడిగా - పి. ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా - మద్దినేని అజయ్‌లను నియమించారు. పార్టీ సలహాదారులుగా డీఏ సోమయాజులు, సీసీ రెడ్డిలు వ్యవహరించనున్నారు. పార్టీ సెంట్రల్ గవర్నరింగ్ కౌన్సిల్ సభ్యులుగా... కొణతాల రామకృష్ణ, పెనుమత్స సాంబశివరాజు, వైవీ సుబ్బారెడ్డి, హాబీబ్ అబ్దుల్ రెహ్మన్, బి. కరుణాకర్ రెడ్డి. బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, జూపుడి ప్రభాకర్‌రావు, ఆర్‌కే రోజా సెల్వమణి, డీఏ సోమయాజులు, మాకినేని పెద్దరత్తయ్య, భూమా నాగిరెడ్డి, జక్కపూడి విజయలక్ష్మి, కణితి విశ్వనాథం, తోపుదుర్తి కవిత, బాలమణెమ్మ, ఎమ్ మారెప్ప, జంగ కృష్ణమూర్తి, మదన్‌లాల్ నాయక్, గిరిరాజ్ నాగేష్, గంపా వెంకటరమణలను నియమించారు. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ...

' విజేత ' గా వరుణ్ సందేశ్

Image
హైదరాబాద్:  వరుణ్ సందేశ్ హీరోగా జెమిని ఫిలిం సర్క్యూట్ నిర్మిస్తున్న చిత్రానికి ' విజేత ' టైటిల్ ను ఖాయం చేశారు.  సందీప్ గుణ్ణం ఈ చిత్రానికి దర్శకుడు గా పరిచయ మవుతున్నారు. ఆయన ఇంతకుముందు  ' అమ్మచెప్పింది ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. 

భారత సైంటిస్టుకు అంతర్జాతీయ ఫెలోషిప్

ముంబై, మే 26: రసాయన శాస్త్రంలో మైక్రోమాలిక్యూల్స్ విభాగంలో చేసిన పరిశోధనలకుగాను భారత్‌కు చెందిన డాక్టర్ జయంత్ కందారే ప్రతిష్టాత్మకమైన అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. జయంత్ ప్రస్తుతం పిరామల్ లైఫ్ సెన్సైస్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నారు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారిలో ఇప్పటివరకు 44 మంది నోబెల్ బహుమతిని గెలుచుకోవడం గమనార్హం. జర్మనీకి చెందిన హంబోల్ట్ ఫౌండేషన్ పరిశోధన రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించడానికి ఈ ఫెలోషిప్‌ను అందజేస్తోంది. డాక్టర్ జయంత్ ముంబై యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పూణెలోని నేషనల్ కెమికల్ లాబరేటరీనుంచి పీహెచ్‌డీ చేశారు. కేన్సర్ కణాలను నాశనం చేసే ఔషధాలపై జయంత్ పరిశోధనలు చేస్తున్నారు.