‘మహంకాళి’ షూటింగ్‌లో గాయపడ్డ రాజశేఖర్
చెన్నై,మే 29: ‘మహంకాళి’ చిత్ర షూటింగ్‌లో హీరో రాజశేఖర్ సోమవారం గాయపడ్డారు. గాయపడిన రాజశేఖర్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కుడి చేతికి, కన్నుకు గాయమైనట్టు సమాచారం. ఆయనకు ప్రమాదమేమి లేదని 15 రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. రాజశేఖర్ సతీమణి జీవిత దర్శకత్వంలో ‘మహంకాళి’ చిత్రం రూపొందుతోంది. కిల్‌పాక్ మెడికల్ కాలేజిలో ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Comments