తెలంగాణ వచ్చి తీరుతుంది: సుష్మా
కరీంనగర్, మే 31: తెలంగాణ రాష్ట్రం 2014 సంవత్సరంలో ఏర్పాటై తీరుతుందని బీజేపీ సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్షనాయకురాలు సుష్మాస్వరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.కరీంనగర్‌లో రాష్ట్ర బి.జె.పి.ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పోరు’ సభలో సుష్మా ప్రసంగిస్తూ.. తెలంగాణ సంస్కతి, చరిత్ర చాలా గొప్పదన్నారు. నైజాం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఆమె నివాళులర్పించారు. అంతేకాక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు కూడా సుష్మా నివాళులర్పించారు. తెలంగాణ సాధనే బీజేపీ లక్ష్యమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం తెలంగాణ కోసం పోరాడుతునే వుంటామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తీరుతామన్నారు.
Comments