గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ ' నిప్పు '
హైదరాబాద్: రవితేజ హీరోగా బొమ్మరిల్లు బ్యానర్ పై దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్న 'నిప్పు' చిత్రం షూటింగ్ హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రవితేజ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాజమౌళి క్లాప్ ఇచ్చారు. మామూలుగా గుణశేఖర్ సినిమాలు భారీతనానికి నిదర్శనంగా నిలుస్తాయి. భారీ సెట్లు, భారీ ఖర్చు సినిమా నిండా కనపడతాయి. అయితే, ఈమధ్య కాలంలో తన సినిమాలను (అర్జున్, సైనికుడు, వరుడు) ఆ భారీతనం ఏమాత్రం కాపాడలేకపోయిన విషయాన్ని గుణసేఖర్ గ్రహించాడేమో... తాజాగా రూపొందిస్తున్న 'నిప్పు' సినిమాలో ఆ భారీతనానికి, భారీ సెట్స్ కు, గ్రాఫిక్స్ కు స్థానం ఇవ్వడం లేదని దర్శకుడు గుణశేఖర్ స్వయంగా చెప్పాడు. రవితేజ బాడీలాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉంటూనే, కొత్తదనంతో అతని పాత్ర సాగుతుందని గుణశేఖర్ చెప్పారు. ఈ సినిమాకి ఆకుల శివ సంభాషణలు రాస్తున్నారు. హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదట. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత వై.వి.ఎస్.చౌదరి చెప్పారు.

Comments