గేల్ పై వెస్టిండీస్ బోర్డు వేటు
అంటిగ్వా,మే 29: బోర్డు మేనేజ్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్‌పై అనుచిత వాఖ్యలు చేసినందుకు విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ వేటు వేసింది. భారత్‌తో ప్రారంభం కానున్న సిరీస్‌లో ఒక టీ20 మ్యాచ్‌కు, మరో రెండు వన్డేలకు గేల్‌ను దూరంగా ఉంచుతూ వెస్టిండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా టీమ్, బోర్డ్ మేనేజ్‌మెంట్‌పై జమైకా రేడియోలో గేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం లేపాయి. దాంతో గేల్ నుంచి వివరణ కోరేందుకు సెలక్షన్ కమిటీ ముందు హాజరుకావాలని బోర్డు కోరింది.
Comments