అవిశ్వాస తీర్మానం పెట్టండి చూద్దాం....సి.ఎం. సవాల్
చిత్తూరు,మే 29: దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని సీఎం స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానానికి ఎంత సంఖ్య కావాలో తెలియని వారు కూడా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ది కోసమే పార్టీలు ఎదురుదాడి చేస్తున్నాయని విమర్శించారు.
Comments