మరోసారి జూపల్లి రాజీనామా
హైదరాబాద్.మే 31: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గవర్నర్ నరసింహన్‌ను కలిసి మరోసారి రాజీనామా సమర్పించారు. మార్చి 3 తేదిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలకు జూపల్లి కృష్ణారావు రాజీనామా లేఖను పంపిచారు. అయితే జూపల్లి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. దాంతో గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించి, ఆమోదించాల్సిందిగా కోరారు.మంత్రులందరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు.
Comments