Posts

కన్నీటికి ఓట్లు రాలేనా...

Image
విశాఖపట్నం, మే 31:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం తన ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన కూతురు షర్మిళతో పాటు పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి వచ్చే ముందు తాను జైలులో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చానని, జగన్ చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాడని, తాను ఏ తప్పు చేయలేదని తనతో చెప్పాడని అన్నారు. ధైర్యంగా ఉండమని తనకూ చెప్పాడన్నారు.ఉప ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించాలని చెప్పాలని తనకు సూచించాడన్నారు. వైయస్ కాంగ్రెసును కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చి, ప్రజల కోసం పథకాలు ప్రవేశపెడితే ఇప్పుడు ఆయనను దోషిగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సిబిఐ విచారణ సజావుగా సాగిందని తాను భావించడం లేదన్నారు. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించారని షర్మిళ ఆరోపించారు. కుట్ర రాజకీయాలకు ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు.

రాష్ట్రంలో బారత్ బంద్ పాక్షికం

Image
హైదరాబాద్, మే 31:  పెట్రోల్ ధరల పెంపును  నిరసిస్తూ కాంగ్రెసేతర పార్టీలు చేపట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని జిలాల్లలో ఆర్టీసి డిపోల ఎదుట తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. హైదరాబాదులో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది.  మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద  సిపిఎం ఆందోళన కారణంగా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లలేదు.  నగరంలో కొన్నిచోట్ల పెట్రోల్ బంకులను మూసివేశారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే యాభై బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్టీసి అధికారులు చెప్పారు. నగరంలో లోకల్ బస్సులు యథావిథిగా తిరుగుతున్నాయి. దక్షిణ భారత దేశంలో బంద్ ప్రభావం పెద్దగా  లేదు. తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలలో బంద్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అయితే ఉత్తర భారత దేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. ముంబయి, లక్నో, పాట్నాలలో శివసేన, బిజెపి, బిజెడి కార్యకర్తలు రోడ్ల పైక...

వివాదాస్పద సైన్యాధిపతి జనరల్ వికె సింగ్‌ పదవీ విరమణ

న్యూఢిల్లీ, మే 31:  అత్యంత వివాదాస్పద సైన్యాధిపతిగా పేరొందిన జనరల్ వికె సింగ్‌ గురువారం పదవీ విరమణ చేశారు. తన పదవి విరమణ వయస్సు విషయంలో ప్రభుత్వాన్నే కోర్టుకీడ్చి రికార్డు సృష్టించిన ఆయన ప్రభుత్వం పట్టుదల, కోర్టు తీర్పులకు మెట్టుదిగి, బెట్టువీడి చివరకి పదవి విరమణ చేయక తప్పలేదు. అటు అత్యంత సమర్థుడుగా, ఇటు అతి వివాదాస్పదుడిగా జనరల్‌ వికె సింగ్ చరిత్రలో నిలిచిపోయారు. తనకే తోటి అధికారులు లంచం ఇవ్వజూపారని వెల్లడించి, సుక్నా భూ కుంభకోణంలో నిందితులకు శిక్షలు వేసి ఆయన ఆర్మీలో అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా వార్తల్లో నిలిచారు. మరో వైపు ఆర్మీలో వర్గపోరుకు తెరతీసిన వ్యక్తిగా, రక్షణశాఖతో బాహీబాహీకి దిగిన వ్యక్తిగా ఆయన మిగిలిపోయారు. మొత్తం మీద ప్రత్యక్ష యుద్ధాల్లో స్వయంగా పాల్గొని, సేనలను నడిపించిన అనుభవం ఉన్న వికె సింగ్ సైనిక జీవన చరమాంకం వివాదాస్పదంగా మిగిలిపోయింది. చిట్టచివరి అధికారిక కార్యక్రమంలో జనరల్‌ వికె సింగ్‌ అమరజవాన్లకు నివాళి అర్పించారు. ఆయన స్థానంలో జనరల్‌ విక్రమ్ సింగ్‌ సేనాధ్యక్షుడిగా రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహిస్తారు.

నర్సన్నపేటలో విజయమ్మ రోడ్ షో

Image
మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని తళ్ళీకూతుళ్ళ పిలుపు  శ్రీకాకుళం,మే 30:   వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మశ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోరోడ్ షో నిర్వహిస్తూ తొలి ఎన్నికల ప్రసంగం చేశారు,  జగన్‌కు జరిగిన అన్యాయాన్ని,  రాజశేఖర రెడ్డిపై జరిగిన కుట్రను, తన కడుపు మంటను  గుర్తు పెట్టుకుని ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు.    వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు. పాదయాత్ర అనుభవాలను, అంతకు ముందటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, పార్టీలకూ మతాలకూ కులాలకూ అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలని వైయస్ ఆశించారని, ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూడడానికే రచ్చబండ కార్యక్రమానికి ఆ రోజు బయలుదేరారని అన్నారు. రైతుల కోసమే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రతి అన్యాయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ...

బొబ్బిలి కాంగ్రెస్ కోటకు బీట

Image
జగన్  పార్టీలో చేరిన  ఎమ్మెల్యే  రంగారావు  విజయనగరం,మే 30:  బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ వెంకట రంగారావు బుధవారం తన శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనితో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకిఎదురుదెబ్బ తగిలినట్లయింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పట్టున్న ఈ జిల్లా నుంచి ఓ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైరివర్గంలో చేరడం ఇదే ప్రథమం. దీనితో జిల్లాలో రాజకీయ సమీరకణాలు మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.దీనితో అసంతృప్తితో ఉన్న రంగారావు కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. రంగారావు ఇటీవల హైదరాబాదు వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.  తాను జగన్‌కు సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే వచ్చానని ఆయన అప్పట్లో చెప్పారు.
Image
తమిళనాడు లోని ఇరోడ్ లో ఒక ప్రైవేటు ఫెర్టిలిటీ ఆస్పత్రిలో ఈ నె ల 23న ఒకేరొజున పుట్టిన బేబీలు వీళ్ళంతా...   వీళ్ళు మొత్తం 26 మంది కాగా, వీరిలో ఏడుగురు కవలలు ఉన్నారు.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు ఇక కామన్ ఎంట్రన్స్...

ఇంటర్ మార్కులకు 50 శాతం వెయిటేజీ   న్యూఢిల్లీ,  మే 28: ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే ఇంజనీరింగ్ విద్యా సంస్థలకు 2013 విద్యా సంవత్సరం  నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆధ్వర్యంలో జరిగిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల పాలక మండళ్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి పరిధిలోకి వచ్చే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని తీర్మానించారు. అదే సమయంలో 12వ తరగతి (ఇంటర్మీడియెట్) పరీక్షలను కూడా ప్రవేశార్హతలో పరిగణనలోకి తీసుకోవాలని.. ఇంటర్ మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలో భాగంగా మెయిన్ టెస్ట్, అడ్వాన్స్ డ్  టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ రెండు టెస్టులూ ఒకే రోజు జరుగుతాయి. మెయిన్ టెస్టులో అత్యధిక మార్కులు సాధించిన 50,000 మందికి చెందిన అడ్వాన్స్ టెస్ట్ పేపర్లను మూల్యాంకనం చేసి.. మెరిట్ ప్రాతిపదికన ఐఐటీ ప్రవేశాలకు ర్యాంకులు ఇస్తారు. ఐఐటీలు మినహా ఇతర కాలేజీలకు.. బోర్డు పరీక్షల మా...

టైమ్స్ మ్యాగజైన్‌లో ’ఆవారా’

Image
వాషింగ్టన్, మే 28: : 1950 దశకంలో  భారత సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ’ఆవారా’ చిత్రానికి అమెరికాలోని ప్రముఖ పత్రిక టైమ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కింది. 1951 సంవత్సరంలో ఆవారా చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజ్ కపూర్ నిర్మించారు. 1923 నుంచి నిర్మించిన 100 గొప్ప చిత్రాల జాబితాను టైమ్స్ మ్యాగజైన్ రూపొందిస్తోంది. చార్లీ చాప్లిన్ చిత్రం ‘ది ట్రాంప్’ను స్పూర్తిగా తీసుకుని ఆవారా చిత్రాన్ని నిర్మించారు. ఆవారా చిత్రంలో నర్గీస్‌తో కలిసి రాజ్ కపూర్ మెరుపులు మెరిపించారు. ఈ చిత్రంలో శంకర్-జైకిషన్ అందించిన ‘ఆవారా హూ’ పాట సంగీత ప్రపంచంలో  టాప్‌గా నిలిచింది. 

ఉప ఎన్నికల బరిలో 255 మంది

åహైదరాబాద్,  మే 28þ: ªÃ†¾Z¢©ð 18 Æå®¢Hx, ŠÂ¹ ¤Äª½x-„çÕ¢{Õ ²Än¯Ã-EÂË •Jê’ …X¾ ‡Eo-¹©ðx Ʀµ¼u-ª½Õn© ÅŒÕC èÇG-ÅÃÊÕ ‡Eo-¹© ¹NÕ-†¾¯þ “X¾Â¹-šË¢-*¢C. „çáÅŒh¢ 255 «Õ¢C …X¾ ‡Eo-¹© ¦J©ð EL-Íê½Õ. ¯ç©Öxª½Õ ¤Äª½x-„çÕ¢{Õ ²Än¯Ã-EÂË 13 «Õ¢C, 18 Æå®¢Hx ²Än¯Ã-©Â¹× 242 «Õ¢C ¤òšÌ©ð …Êo{Õx “X¾ŸµÄÊ ‡Eo-¹© ÆCµ-ÂÃJ ¦µ¼Êy-ªý-©Ç©ü ÅçL-¤Äª½Õ. Š¢’î-©Õ©ð ÆÅŒu-Cµ-¹¢’à 23 «Õ¢C ¤òšÌ©ð …¢œ¿’à ªÃ•¢-æX{, Aª½Õ-X¾-A©ðx 19 «Õ¢C ÍíX¾ÛpÊ …X¾ ‡Eo-¹© ¦J©ð EL-Íê½Õ. ʪ½q-Êo-æX{, ¤ò©-«-ª½¢-©©ð ÆÅŒu-©p¢’à ‚êª®Ï «Õ¢C ÍíX¾ÛpÊ ¤òšÌ©ð …¯Ãoª½Õ. Š¢’î©Õ, Aª½Õ-X¾A, ªÃ•¢-æX-{©ðx ‡Â¹×ˆ-«-«Õ¢C …Êo¢-Ÿ¿ÕÊ éª¢œä®Ï ¨O‡¢ §ŒÕ¢“ÅÃ©Õ …X¾-§çÖ-T¢-ÍŒ-ÊÕ-Êo{Õx “X¾ŸµÄÊ ‡Eo-¹© ÆCµ-ÂÃJ ¦µ¼Êy-ªý-©Ç©ü ÅçL-¤Äª½Õ. 

ఓదార్పు కావలెను...

Image
హైదరాబాద్, మే 28: రాష్త్ర వ్యాప్తంగా విస్తృతంగా ఓదార్పు యాత్రలు జరిపిన జగన్ కు ఇప్పుడు ఓదార్పు కావాలి. అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన జగన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జగన్ తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే జగన్‌ను కస్టడీకి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో జగన్‌ను చంచల్‌గూడ జైలుకి తరలించారు. జగన్ కస్టడీకి సంబంధించి హైకోర్టుని ఆశ్రయించాలని  సీబీఐ నిర్ణయించింది. కాగా, జగన్, విజయసాయి రెడ్డి మినహా తొలి చార్జ్‌షీటలో సీబీఐ పేర్కొన్న పదకొండు మంది నిందితులకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే రెండవ చార్జ్‌షీట్‌లోని నిందితుల జాబితాలో సైతం జగన్, విజయసాయి రెడ్డి పేర్లు పొందుపరచడంతో వారికి బెయిలు ఇవ్వజాలమని కోర్టు స్పష్టం చేసింది.  30 నుంచి విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారం  కొడుకు అరెస్ట్ తో ఓ రోజు నిరాహార దీక్ష చేసిన విజయమ్మ  అతగాడికి జైలు తప్పక పోవడంతో  దీక్ష విరమించి గుండె నిబ్బరం చెసుకుని ఉప ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. విజయమ్మ ఈ నెల 30 నుంచి ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభ...

జగన్‌ అరెస్టు : రేపు సీబీఐ కోర్టులో హాజరు

Image
హైదరాబాద్,మే 27: అక్రమాస్తుల కేసులో  అనుకున్నట్టే  జగన్‌ను సి.బి.ఐ. అరెస్టు చేసింది. ఆదివారం నాడు  మూడో రోజు విచారణ అనంతరం  రాత్రి 7.20 గంటలకు జగన్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. జగన్‌పై ఆర్‌సీ 19 (ఏ) నిబంధన ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే అవినీతి నిరోధక చట్టంలోని 13(1), 13(2)తో పాటు 120 (బీ), రెడ్‌విత్ 420, 409, 477 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు  జగన్‌ను సీబీఐ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఈ రాత్రికి జగన్‌ను దిల్‌కుషాలోనే నిర్బంధంలో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.జగన్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. జగన్ అరెస్టు తర్వాత పలు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం అందింది. విజయవాడలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కార్యకర...

జగన్ అరెస్టుపై జోరుగా ఊహాగానాలు ...

హైదరాబాద్,మే 27:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై ఆదివారం  ఊహాగానాలు జోరందుకున్నాయి.  ఆదివారం మూడవ రోజు కూడా  జగన్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం సమయంలో ఉన్నతాధికారులు.. హైదరాబాదులో సెలవులలో ఉన్న పోలీసులను తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. విధులలో ఉన్న సిబ్బంది అలెర్ట్ కావాలంటూ ప్రత్యేక ఆదేశాలు వెలువడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పోలీసులు బలగాలు మరింత అప్రమత్తమయ్యాయని తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు. మరోవైపు . దిల్‌కుషా అతిథి గృహం వద్ద బయట ఉన్న జగన్ వర్గం నేత హడావుడిగా తిరగడం ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ అప్రమత్తత, హడావుడి సోమవారం జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు కూడా కావొచ్చునని, అరెస్టు కోసమే కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి. కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో జగన్ సోమవారం  కోర్టుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా పోలీసులను రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తం చేసి ఉండవచ్చునని అంటున్నారు. పలు కూడళ్లలో, వైయ...

డే -2---మరో ఏడున్నర గంటలు

Image
ఆదివారం కూడా విచారణ  హైదరాబాద్ , మే 26:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని  శనివారం రెండో రోజు కూడా  సిబిఐ అధికారులు ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. సిబిఐ విచారణ ముగిసిన తర్వాత దిల్‌కుషా అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆదివారం మళ్లీ విచారణకు రమ్మన్నారని ఆయన చెప్పారు. పలు విషయాలపై వివరణలు అడిగారని, సిబిఐ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని ఆయన అన్నారు. బై బై బై అంటూ వాహనంలో వెళ్లిపోయారు. ఆదివారం  మోపిదేవి వెంకటరమణతో కలిపి జగన్‌ను విచారించే అవకాశం ఉందని అంటున్నారు.  సోమవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

బిజెపి గూటికి జయప్రద ?

Image
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద బిజెపి గూటికి చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకుగాను ఆమె పదిహేను రోజుల క్రితం బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో రహస్యంగా సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు బిజెపి నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్లు సమాచారం.  ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజక వర్గం నుంచి రెండు సార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైన జయప్రద సమాజ్‌వాదీ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అమర్ సింగ్‌కు సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలు తెగిపోవడంతో జయప్రద పరిస్థితి కూడా సందేహంలో పడింది. ఈ స్థితిలో బిజెపి ఆమెకు ఆలంబనగా నిలిచింది. ఆమె రాంపూర్ లోకసభ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం. అయితే, బిజెపి రాంపూర్ సీటు ఇస్తుందా, రాజ్యసభకు ఎంపిక చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

జీడిగుంట రామచంద్రమూర్తి కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ఆవిష్కరణ

Image
హైదరాబాద్,మే 25: ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ఆవిష్కరణ సభ శుక్రవారం సాయంత్రం సిటీ సెంట్రల్ లైబ్రరీలో అభిమానులు, ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో ఆహ్లాదకర వాతావరణం లో జరిగింది. కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎన్. శివారెడ్డి  ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయనతో పాటు దూరదర్శన్ కార్యక్రమ నిర్వహణాధికారి ఓలేటి పార్వతీశం,  నటుడు సుబ్బరాయ శర్మ, ఆచార్య నిర్మల, తెలుగు విశ్వ విద్యాలయం పౌర సంభందాల అధికారి జె.చెన్నయ్య, కిన్నెర అధినేత ఎం. రఘురాం తదితరులు రామచంద్ర మూర్తి కధా రచనా శైలిని  కొనియాడారు.  రామ చంద్ర మూర్తి ధన్య వాదాలు తెలియ చేస్తూ, తిరిగే కాలు, తిట్టే నోరూ మాదిరి, రాసే కలం తన చేత మరిన్ని మంచి కథలు రాయించ గలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన తాజా కథల సంపుటి ' నిన్నటి కొడుకు ' ను  ఆయన కిన్నెర రఘురాం కు అంకిత మిచ్చారు.   

ఎనిమిది గంటల సేపు జగన్ విచారణ

హైదరాబాద్,మే 25: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ  శుక్రవారం నాడు  దాదాపు ఎనిమిది గంటల సేపు విచారించింది. బయటకు వచ్చిన తరువాత జగన్ విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. వారు అడిగిన వివరాలను ప్రశాంతంగా వివరించినట్లు చెప్పారు. శనివారం  మళ్లీ విచారణకు రమ్మన్నట్లు ఆయన తెలిపారు. శనివారం  ఉదయం 10.30 గంటలకు జగన్ మరోసారి సిబిఐ ఎదుట హాజరవుతారు. వైయస్ జగన్ సిబిఐ విచారణ ముగిసి బయటకు వచ్చే వరకు కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను విచారణ అనంతరం ఐదు గంటలకు చంచల్‌గుడా జైలుకు తరలించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణను కూడా ముగించారు. ఆ తర్వాత కూడా జగన్‌ను విచారించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయనను అరెస్టు చేస్తారా అనే సందేహం తలెత్తింది.

జగన్ తో చేతులు కలపిన మైసూరా...టి.డి.పి. నుంచి సస్పెన్షన్

Image
హైదరాబాద్,మే 25:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసం తాను ఏమైనా చేస్తానని మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు ఎం. వి మైసురా రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. తనకు వైయస్ జగన్ చిన్నప్పటి నుంచీ తెలుసునని, రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తి అని, జగన్ ఎదుగుదలను చూసి ఓర్వలేక మూకుమ్మడి దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కావడంతో పలకరించడానికి వచ్చానని ఆయన అన్నారు. తనకు సాయం చేయాలని వైయస్ జగన్ కోరారని, అందుకు తాను సమ్మతించానని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు కోసం, జగన్ శ్రేయస్సు కోసం ఎలాంటి పనైనా చేస్తానని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేయడానికే  మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారని ఆయన అన్నారు. మోపిదేవిని బలిపశువును చేస్తున్నారని ఆయన అన్నారు. చట్టం తన పని చేస్తుంటే సంతోషించేవాడినని, ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోసం పనిచేస్తానని, అందులో చేరడం చేరకపోవడం ...

జగన్ ఆస్తుల కేసులో మంత్రి మోపిదేవి అరెస్ట్

Image
హైదరాబాద్, మే 24: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.  వాన్‌పిక్ భూముల కేటాయింపులో ఆయన అరెస్టయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన మోపిదేవి వాన్‌పిక్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.  నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలతో కలిపి గంటన్నర పాటు విచారించిన తర్వాత మోపిదేవిని సిబిఐ అరెస్టు చేసింది. మోపిదేవి వెంకటరమణ ఇష్టానుసారం జీవోలు జారీ చేశారని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది.  బుధవారం  ఏడు గంటల పాటు మోపిదేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు గురువారం కూడ్ కూఆడా విచారణ జరిపిన అనంతరం  అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టయిన నేపథ్యంలో  మోపిదేవి తన మంత్రి పదవికి రాజీనామా చశారు. ఇతర మంత్రుల్లో గుబులు... జగన్ ఆస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఇతర మంత్రుల్లో గుబులు ప్రారంభమైంది. ఆరుగురు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు జ...

భగ్గుమన్న పెట్రోల్: ఏకంగా లీటరుకు రూ.7.50 పెంపు

న్యూఢిల్లీ,మే 23: కేంద్రం మరోసారి పెట్రోలు ధరలను భారీగా  పెంచింది. ఏకంగా లీటరుకు రూ.7.50 రూపాయలు పెరిగింది. రాష్ట్రంలో పన్ను రూపేణా మరికొంత అదనపు బాదుడు తప్పకపోవడంతో ఈ పెంపునకు మరికొంత మొత్తం చేరి అది రూ.9కి చేరుకుంటుంది. మొత్తంగా రాష్ట్రంలో లీటరు పెట్రోలు ధర రూ.82కు చేరుకోనుంది. రాష్ట్రీయ ఆయిల్ ఉత్పత్తి కంపెనీలు లీటరుకి పెంచమని కోరిన రూ.6.28 కంటే ఇది ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది.  డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.56కు చేరుకుంది. ఈ పరిణామంతో వేల కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. పెట్రో ధరలపై నియంత్రణ లేకపోవడంతో ఆయా కంపెనీలు ప్రతిపాదించిన మొత్తం పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కాంగ్రెస్ పార్టీకి వైఎస్ వివేకా గుడ్‌బై

Image
పులివెందుల: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషిస్తున్న తీరుపై కలత చెంది కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్టు వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి ప్రకటించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైస్‌ను విమర్శిస్తే సహించలేమని వివేకానంద రెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోతున్నానని , కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వివేకానంద అన్నారు. పులివెందులలో కార్యకర్తలతో, వైఎస్ అభిమానులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. పార్టీని వీడుతున్నట్టు వైఎస్ వివేకానందరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.