Posts

Image
మాజీ ప్రధాని ఇందిరా గాంధి 27 వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆమె సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న  సోనియా, రాహుల్ 
Image
ప్రపంచ జనాభా సోమవారం ఉదయం 7.22 కి పుట్టిన ఈ బేబీ తో 700 కోట్లకు చేరింది. లక్నో లోని మాల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వినీత అనే మహిళకు పుట్టిన ఈ ఆడ బిడ్డకు నర్గీస్ అని పేరు పెట్టారు.

గడ్డు స్థితిలో కిరణ్ సర్కార్...

Image
హైదరాబాద్,అక్టోబర్ 31: రాష్ట్రంలో  కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ సర్కారు గడ్డు పరిస్థితి లో పడింది.   17 మంది పీఆర్పీ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ అసెంబ్లీలో బలం 175కి చేరినా, మారిన పరిస్థితుల్లో ఇప్పుడది ఒకేసారి  143 కు పడిపోయింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో కనీస మెజారిటీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148.  కాంగ్రెస్ అనుబంధ ఎమ్మెల్యే (మహబూబ్‌నగర్) రాజేశ్వరరెడ్డి మరణంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 293కు తగ్గింది. ఈ లెక్కన మెజారిటీకి కనీసం 147 మంది సభ్యుల మద్దతు అవసరం. అలా చూసినా కాంగ్రెస్‌కు నలుగురు సభ్యులు తక్కువవుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 26 మంది జగన్ వర్గం ఎమ్మెల్యేలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తెలంగాణపై కాంగ్రెస్  వైఖరి ని నిరసిస్తూ  ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య ఇటీవల శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు.  ఇప్పుడు  మరో ముగ్గురు  ఎమ్మెల్యేలు రాజయ్య (స్టేషన్ ఘన్‌పూర్), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సోమారపు సత్యనా...

అరుణాచల్ సి.ఎం. రాజీనామా

ఇటానగర్,అక్టోబర్ 31:  అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జార్బోమ్ గామ్లిన్ తన పదవికి రాజీనామా చేశారు.  ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. పార్టీలో గొడవలే ఆయన రాజీనామాకు కారణమని సమాచారం. కొత్త  నాయకుడిని ఎన్నుకోవడానికి కాంగ్రెసు శాసనసభా పక్షం సమావేశమవుతోంది.  నాయకత్వ అంశంపై పాలక కాంగ్రెసు పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లిన నేపథ్యంలో రాజీనామా చేయడానికి గామ్లిన్ రేండు రోజుల క్రితమే సిద్ధపడ్డారు.  మే 5వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మరణించడంతో గామ్లిన్ ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

టీఆర్‌ఎస్ లో చేరిన ముగ్గురు టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్,అక్టోబర్ 30: : తెలంగాణాకు  చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, టి. రాజయ్య, సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.  వీరు ముగ్గురికి టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు సాదరంగా, గులాబీ కండువలు కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. తమ రాజీనామాలతో అధిష్టానానికి పరిస్థితి అర్ధమవుతుందని భావిస్తున్నామని  అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో జనం పోటెత్తారు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ముగ్గురితో పాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన జోగురామన్న, గంప గోవర్ధన్‌లతో కలిపి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంఖ్య 17కు పెరిగింది. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో జనం పోటెత్తారు. ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

కరువు ప్రాంతాలుగా 456 మండలాలు

హైదరాబాద్,అక్టోబర్ 30: రాష్ట్రంలో 15 జిల్లాల్లోని 456 మండలాలను  ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది.  ‘‘15 జిల్లాల్లోని 782 మండలాలకుగాను 456 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న కలెక్టర్ల నివేదికల ఆధారంగా వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ తొలి దశలో నిర్ణయించామని , పంటకోత  పూర్తయ్యాక రెండో దశలో మరిన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ఉందని మంత్రివర్గ సమావేశం అనంతరం  సమాచార మంత్రి డి.కె.అరుణ తెలిపారు.  అనంతపురం జిల్లాలలో లో మొత్తం మండలాలను, అనంతరం అత్యధికంగా నల్లగొండలో 52 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోఅవతరణ ఉత్సవాలు తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో ఈ ఏడాది రాష్ట్ర అవతరణ ఉత్సవాలను  జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో జరిగే అవతరణ ఉత్సవాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేస్తారు.  జిల్లాలలో మాత్రం కలెక్టర్లు రాష్ట్ర అవతర ఉత్సవాలలో పాల్గొంటారు.  అజాద్...అదేమాట తెలంగాణ అంశాన్ని పరిష్కరించడానికి నిర్దిష్ట గడువేమీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ...

ఇంటర్, టెంత్ పరీక్షల తేదీలు ఖరారు

హైదరాబాద్ ,అక్టోబర్ 29:  పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలను విద్యాశాఖ శనివారం ప్రకటించింది. మార్చి 2 నుంచి మార్చి 21వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు, మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీవరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ... పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి.

టి 20 గెలిచిన ఇంగ్లండ్

కోల్ కతా,అక్టోబర్ 29:  ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఏకైక టి 20 క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 18.4 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. పఠాన్, జడేజా, రైనా, కోహ్లీ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇక తెలుగు లోనూ ' డాట్రీ ' పరీక్ష...!

న్యూఢిల్లీ,అక్టోబర్ 28:  ఆంధ్రప్రదేశ్ సహా మరో మూడు రాష్ట్రాల్లో వైద్య విద్య జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ను ప్రాంతీయ భాషలోనే నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ గురువారం  ప్రకటించారు. ఇది విద్యార్థులకు లాభిస్తుందని, వారు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. ‘జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై భారత వైద్య మండలి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించగా తమిళనాడు మాత్రమే అభ్యంతరాలు తెలిపిందని అన్నారు. పండుగల నేపథ్యంలో తెలంగాణలో ఉద్యోగులు సమ్మె విరమించడం హర్షనీయమని ఆజాద్ అన్నారు. ‘తెలంగాణ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని, గతంలో చెప్పినట్టుగానే సత్వర పరిష్కారానికి కట్టుబడామని చెప్పారు.

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

Image
విశాఖపట్నం,అక్టోబర్ 28:  ప్రముఖ సాహితీవేత్త, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు అనారోగ్యంతో విశాఖలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను  చాటారు.  ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. అవసరాల మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.

దర్శకుడు దాసరికి భార్యా వియోగం

Image
హైదరాబాద్,అక్టోబర్ 28:  ప్రముఖ దర్శక, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు సతీమణి పద్మ శుక్రవారం మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన పద్మను కుటుంబ సభ్యులు మంగళవారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం  తెల్లవారుజామున మరణించారు. దాసరి దర్శకత్వం వహించిన పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా పద్మ మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.
Image
' వార్తాప్రపంచం ' వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు... 

పాలసీ రేట్లు పావు శాతం పెంపు

ముంబై,అక్టోబర్ 26: రెండంకెల స్థాయిలో ఆందోళన క లిగిస్తున్న  ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ మరోసారి పాలసీ రేట్లను పావుశాతం చొప్పున పెంచింది.  రెండో త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్రవ్యోల్బణం అదుపులోపెట్టేందుకు వృద్ధిరేటును కొంత పణంగా పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని ఆర్‌బీఐ స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీంతో గృహ, వాహన ఇతరత్రా అన్నిరకాల రుణాలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో పాటు నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు కూడా భారమయ్యే అవకాశం ఉంది. 2010 మార్చి నుంచి ఇప్పటిదాకా గడిచిన 20 నెలల్లో ఆర్‌బీఐ వడ్డీరేటును పెంచడం ఇది 13వ సారి కావడం గమనార్హం. మరోపక్క, సేవింగ్స్ బ్యాంక్(ఎస్‌బీ) ఖాతాలపై డిపాజిట్‌రేట్లపై నియంత్రణను ఎత్తివేస్తూ ఆర్‌బీఐ అతి కీలకమైన పాలసీ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది.ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇకనుంచి ఎస్‌బీ ఖాతా డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను స్వేచ్ఛగా నిర్ణయించుకునే వెసులుబాటు లభిస్తుంది. దీనివల్ల ఖాతాదార్లకు తమ సొమ్ముపై మరింత ...

ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

కోల్‌కతా,అక్టోబర్ 25:  ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారమిక్కడ జరిగిన చివరివన్డేలోనూ  ఇంగ్లండ్‌ జట్టును 95 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. 5-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 37 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటయింది. క్వీస్‌వెటర్(63), కుక్(60) శుభారంభాన్ని అందినప్పటికీ మిడిలార్డర్ విఫలం కావడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది. భారత బౌలర్లలో జడేజా 4, ఆశ్విన్ 3 వికెట్లు తీశారు. ఆరాన్, రైనా, తివారి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ధోనీ ఎంపికయ్యాడు.

డీఎస్‌ కు అందలం...!

Image
హైదరాబాద్, అక్టోబర్ 25:    శాసనమండలి స్థానానికి కాంగ్రస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఎంపిక రాష్ట్ర పార్టీలో రాజకీయంగా ఉత్కంఠ రేపింది. తెలంగాణకు చెందిన డీఎస్‌కు మున్ముందు ప్రభుత్వంలో కీలక పదవి  అప్పగించే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని  చర్చ జరుగుతోంది.   లోతైన కసరత్తు అనంతరం అధ్యక్షురాలు సోనియానే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మూడురోజులు ఢిల్లీలో మకాం వేసిన కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సలకు కనీస సమాచారమైనా ఇవ్వకుండానే డీఎస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. వారిద్దరూ హైదరాబాద్ తిరిగొచ్చాక, అదీ అర్ధరాత్రి సమయంలో డీఎస్ ఎంపికపై అధిష్టానం నుంచి సమాచారం రావడం  వారిద్దరికీ మింగుడు పడని విషయం. సోమవారం డీఎస్ నామినేషన్‌కు వీరిద్దరితో పాటు ఏకంగా 13 మంది మంత్రులు, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఆర్పీ నేతలు తరలిరావడం కూడా చిన్న విషయం ఏమీ కాదేమో.  ముఖ్యంగా డీఎస్ అభ్యర్థిత్వాన్ని తొలినుంచీ వ్యతిరేకిస్తున్న కిరణ్‌కు ఈ నిర్ణయంతో అధిష్టానం పెద్ద షాకే ఇచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి.  డీఎస్ నామినేషన్ పూర్తయ్యేద...

అమర్‌సింగ్‌కు షరతులతో బెయిల్

న్యూఢిల్లీ,అక్టోబర్ 25:   ఓటుకు నోటు కుంభకోణంలో అరెస్టు అయిన రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు  ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామని  జస్టిస్ సురేష్ కైట్ తన  పేర్కొన్నారు. అయితే ఇందుకోసం రూ.50 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా దిగువ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయకూడదని స్పష్టంచేశారు. విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కోర్టులో హాజరుకావాలని సూచించారు. వీటిలో ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా, దర్యాప్తు అధికారులు అమర్‌సింగ్ బెయిల్ రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో సెప్టెంబర్ 6న అమర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. తర్వాత అనారోగ్యానికి గురికావడంతో 12న ఎయిమ్స్‌లో చేర్చారు. 15న దిగువ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది....

15 లక్షల వరకు గృహరుణాలపై ఒక శాతం వడ్డీ సబ్సిడీ

న్యూఢిల్లీ,అక్టోబర్ 25:   మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం   మరింత రాయితీ కల్పించనుంది.  ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు తీసుకున్న గృహరుణాలపై మాత్రమే ఒక శాతం వడ్డీ సబ్సిడీ కల్పిస్తున్న ప్రభుత్వం, ఇకపై రూ. 15 లక్షల వరకు తీసుకునే గృహరుణాలకు కూడా వడ్డీ సబ్సిడీని వర్తింపజేయనుంది.  అలాగే వడ్డీ రాయితీ పొందేందుకు అర్హమైన గృహనిర్మాణ వ్యయాన్ని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. 

42 రోజుల సమ్మెను విరమించిన టి. ఉద్యోగులు

హైదరాబాద్,అక్టోబర్ 24:  తెలంగాణ ఉద్యోగ సంఘాలు  42 రోజుల సమ్మెను విరమించాయి. సోమవారం రోజంతా ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగ సంఘాలతో  జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించడానికి వారు అంగీకరించారు.  మొత్తం 9 అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి జెఎసి నేతలకు మధ్య ఒప్పందం కుదిరింది. మంగళవారం నుంచి విధులలో చేరేందుకు నేతలు అంగీకరించారు. ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాల మధ్య కుదిరిన  ఒప్పందం వివరాలు... 1. 610 జీవో అమలు పర్యవేక్షణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో న్యాయ కమిటీ ఏర్పాటు 2. సమ్మె కాలంలో ఎస్మా ప్రయోగం నిలిపివేత 3. ఉద్యోగులపై కేసులు ఎత్తివేత 4.177 జీవో అమలు సమ్మె కాలంలో నిలిపివేత 5. సమ్మె కాలంలో బదిలీలు, డిపుటేషన్లు రద్దు 6. నో వర్క్, నో పే అమల్లో ఉన్నా స్పెషల్ కేసుగా పరిగణిస్తూ మినహాయింపు 7. సమ్మెకాలంలో కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఆంక్షలు మినహాయింపు 8. సమ్మెకాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ హాఫ్ పే లీవు 9. మంగళవారం నుంచి విధుల్లో చేరేందుకు అంగీకారం. 

టర్కీలో భారీ భూకంపం: 300 మందికి పైగా మృతి

అంకారా,అక్టోబర్ 23:  ఈశాన్య టర్కీలో సంభవించిన భారీ భూకంపం లో  300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వందలాదిమంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. భూకంప తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.  టర్కీలో ఇప్పటి వరకు వచ్చిన భూకంపాల్లో ఇదే అతి పెద్దది. భూకంపం తర్వాతి ప్రకంపనలు ఇరాన్ సరిహద్దున ఉన్న వాన్‌ సిటీని తాకాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా కుర్దులుంటారు. కూలిపోయిన భవనాలను, వాహనాలను, ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది.

నాలుగో వన్డేలోనూ ధోనీసేన గెలుపు

ముంబై,అక్టోబర్ 23:  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సిరీస్‌లో 4-0 ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 221 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 40.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేరుకుంది. కొహ్లి(86), రైనా(80) అర్థ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ధోనీ 15, రహానే 20 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటయింది. రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.