టీఆర్‌ఎస్ లో చేరిన ముగ్గురు టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్,అక్టోబర్ 30: : తెలంగాణాకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, టి. రాజయ్య, సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. వీరు ముగ్గురికి టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు సాదరంగా, గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. తమ రాజీనామాలతో అధిష్టానానికి పరిస్థితి అర్ధమవుతుందని భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో జనం పోటెత్తారు. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ముగ్గురితో పాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన జోగురామన్న, గంప గోవర్ధన్‌లతో కలిపి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంఖ్య 17కు పెరిగింది. ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో జనం పోటెత్తారు. ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Comments