నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి
విశాఖపట్నం,అక్టోబర్ 28: ప్రముఖ సాహితీవేత్త, నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు అనారోగ్యంతో విశాఖలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. అవసరాల మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు సంతాపం తెలిపారు.

Comments