ఇంటర్, టెంత్ పరీక్షల తేదీలు ఖరారు
హైదరాబాద్ ,అక్టోబర్ 29: పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలను విద్యాశాఖ శనివారం ప్రకటించింది. మార్చి 2 నుంచి మార్చి 21వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు, మార్చి 26 నుంచి ఏప్రిల్ 11వ తేదీవరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ... పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి.
Comments