ఐదు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్
కోల్‌కతా,అక్టోబర్ 25: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారమిక్కడ జరిగిన చివరివన్డేలోనూ ఇంగ్లండ్ జట్టును 95 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. 5-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 37 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటయింది. క్వీస్‌వెటర్(63), కుక్(60) శుభారంభాన్ని అందినప్పటికీ మిడిలార్డర్ విఫలం కావడంతో ఇంగ్లండ్ ఓటమిపాలయింది. భారత బౌలర్లలో జడేజా 4, ఆశ్విన్ 3 వికెట్లు తీశారు. ఆరాన్, రైనా, తివారి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ధోనీ ఎంపికయ్యాడు.
Comments