Posts

మేమిద్దరం టి.డి.పి. తోనే...

Image
ఒంగోలు, జనవరి 28:  జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని  ఆయన తండ్రి, టి.డి.పి. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికష్ణ స్పష్టం చేసారు. తాను తెలుగుదేశం పార్టీని వదిలివెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.  టీడీపీని వదిలే ప్రసక్తే లేదని, తన ఒంటిలో ఉన్నది ఎన్టీఆర్ రక్తమని, తమ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలోనే కొనసాగుతారని హరికృష్ణ స్పష్టం చేశారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసాన్ని ఆయన ఖండించారు. సుస్థిర పాలన అందించేది ఒక్క టీడీపీయేనని, వచ్చే ఎన్నికలలో లో తెలుగుదేశం పార్టీ విజయంసాధిస్తుందని హరికృష్ణ అన్నారు.పార్టీలో తాను, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ క్రీయాశీలంగానే ఉన్నామని  తాము క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఆరోపించే వారు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తాము క్రియాశీలంగా లేమనడం సరికాదని, పార్టీ కన్నా తమకు ఏదీ ముఖ్యం కాదని చెప్పారు.

మణిపూర్ శాసనసభ ఎన్నికలలో హింస: ఇద్దరి మృతి

ఇంఫాల్, జనవరి 28: శనివారం జరిగిన మణిపూర్ శాసనసభ ఎన్నికలలో హింస చోటు చేసుకుంది. చందేల్ పోలింగ్ కేంద్రంపై తీవ్రవాదులు దాడి చేయడానికి ప్రయత్నించారు. సిఆర్ పిఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు. జవాన్లుకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఒక జవాన్, ఒక మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. కాగా, ఈ ఎన్నికలలో 82 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 60 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 279 మంది పోటీ పడ్డారు.

ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత విక్టోరియా అజరెంకా

మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ని విక్టోరియా అజరెంకా గెలుచుకుంది. ఫైనల్స్ లో మారియా షరపోవాపై 6-3, 6-0 తేడాతో అజరెంకా విజయం సాధించింది. అజరెంకా తొలిసారిగా ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుచుకుంది. ఈ బెలారస్ క్రీడాకారిణి టెన్నిస్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానానికి దూసుకువెళ్లింది. కాగా,  ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విజేతగా లియాండర్ పేస్ జోడీ నిలిచింది. నెంబర్ వన్ సీడ్   బ్రయాన్ బ్రదర్స్ పై 7-6, 6-2 తేడాతో పేస్-జపానెక్ జా విజయం సాధించారు.  లియాండర్ పేస్ ఖాతాలో ఇది 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్. పేస్ 7 డబుల్స్, 6 మిక్స్ డ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు. 

స్పల్పంగా పక్కకు ఒరిగిన తాజ్‌మహల్‌ మినార్‌

న్యూఢిల్లీ,జనవరి 28:  ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ నాలుగు మినార్‌లలో ఒకటి స్పల్పంగా పక్కకు ఒరిగింది. నైరుతి దిక్కున ఉన్న ఈ మినార్ తాజ్‌మహల్ నిర్మాణం జరిగినప్పటి నుంచి నిలకడగా ఉన్నప్పటికీ మూడు దశాబ్దాల కాలంలో 3.57 సెంటీ మీటర్ల మేరకు పక్కకు ఒరిగింది. నాలుగు మినార్‌ల ఎత్తులో మాత్రం తేడా ఏర్పడలేదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్‌ఐ ఈ వివరాలను సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాజ్‌మహల్‌కు పర్యావరణ కాలుష్యం వల్ల ప్రమాదం పొంచి ఉందన్న విషయంపై స్పందించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏఎస్‌ఐ తమ నివేదికను సమర్పించింది.

సిరీస్ అసీస్ స్వాహా...

అడిలైడ్,జనవరి 28:  అడిలైడ్‌ టెస్ట్‌లో ఇండియా 298 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.  నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. విదేశాల్లో వరుసగా రెండు సిరీస్‌లను 4-0 తేడాతో ఇండియా ఓడిపోయింది. గత ఏడాది జూలై, ఆగస్టుల్లో ఇంగ్లండ్‌లో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో ఓడిన టీమిండియా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో అదే మార్జిన్‌తో ఓటమి పాలైంది. ఈ వరుస ఓటముల నేపథ్యంలో గత ఏడాది నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో వున్న టీమిండియా తాజాగా, మూడో ర్యాంక్‌కు దిగజారింది. ప్రపంచ ర్యాంకుల్లో నంబర్‌ వన్‌ స్థానంలో వున్న భారత్ జట్టు విదేశీ గడ్డపై వరుస ఓటముల పాలవడం ఇదే ప్రథమం. కాగా, ఈ ఓటమికి ఎవరూ కుంగిపోయి రిటైరవ్వాల్సిన అవసరం లేదని ఇంఛార్జి కెప్టెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు.  కొన్నేళ్లుగా ఇండియా బ్యాటింగ్‌ బ్రహ్మాండంగా వుందని, ఈ రెండు టూర్లలో బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారని చెప్పాడు.  

పుంజుకుంటున్న రూపాయి

ముంబయి,జనవరి 27: రిజర్వ్‌ బ్యాంకు తీసుకున్న చర్యలు, దేశంలోకి విదేశీ మదుపుదారులు డాలర్లు తీసుకురావడంతో రూపాయి క్రమంగా  బలపడుతోంది. నవంబరు 9 తర్వాత మళ్లీ 49 రూపాయల 60 పైసల స్థాయికి రూపాయి బలపడింది.  మార్చి నాటికి 46కు వస్తుందని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా రూపాయి బలానికి కారణమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే యూరో బలపడటం... స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఇండియన్‌ కరెన్సీవిలువ పెరుగుతోంది. 

టీమిండియా 166/6

అడిలైడ్,జనవరి 27:  అడిలైడ్ లో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో  విజయం కోసం 500 పరుగులు చేయాల్సివున్న  టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు  ఆరు వికెట్లు నష్టపోయింది‌.  సెహ్వాగ్‌ ఒక్కడే రాణించి 62 పరుగులు సాధించగా లక్ష్మణ్‌ 33 పరుగులు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ లియాన్‌ మూడు, పేస్‌ బౌలర్‌ హారిస్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. 
Image
ఢిల్లీ రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే సంరంభం...  
Image
రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన థాయ్ లాండ్ ప్రధాని ఇంగ్లక్ షినావత్రా తో రాష్త్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్...

భారత్ 272 ఆలౌట్, ఆసీస్ 50/3

అడిలైడ్,జనవరి 26:  ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 272 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో అత్యధికంగా విరాట్ కోహ్లీ 116 పరుగులు చేయగా , సాహా 35, గంభీర్ 34, సచిన్ 25 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో సిడిల్ 5 వికెట్లు, హిల్‌ఫెనాస్ 3, హారిస్, లియాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా  మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. పాంటింగ్ 1, క్లార్క్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. వార్నర్ 28, కోవాన్ 10, మార్ష్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. అశ్విన్ 2, జహీర్ 1 వికెట్  తీసుకున్నారు.  ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ ను  7 వికెట్ల నష్టానికి 604 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ 382 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది.
Image
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సిక్కు తలపాగాతో రాహుల్ గాంధి  
Image
వార్తాప్రపంచం వీక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు... 

ఇస్రో మాజీ చీఫ్ జి. మాధవన్ నాయర్‌పై వేటు

న్యూఢిల్లీ,జనవరి 25:    వివాదాస్పదమైన యాంత్రిక్స్ - దేవాస్ డీల్‌లో ఇస్రో మాజీ చీఫ్ జి. మాధవన్ నాయర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. మాధవన్ నాయర్‌తో పాటు మరో ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను ప్రభుత్వ పదవులకు అనర్హులుగా ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇస్రో ఎస్ బాండ్ స్పెక్ట్రమ్‌ను ప్రైవేట్ కంపెనీకి కేటాయించిందనే ఆరోపణలపై ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. నాయర్‌తో పాటు ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ కె. భాస్కర నారాయణ, యాంత్రిక్స్ కమర్షియల్ ఆర్మ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఆర్ సిద్ధమూర్తి, ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్ కెఎన్ శంకరలపై ప్రభుత్వం వేటు వేసింది. మాధవన్ నాయర్ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవాస్‌తో కాంట్రాక్టు కుదిరింది. చంద్రయాన్ 1 ప్రాజెక్టు వెనక మాధవన్ నాయర్ ప్రతిభ ఉంది. దేవాస్ డీల్‌పై విచారణ జరిపిన ఉన్నత స్థాయి కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం మాధవన్ నాయర్‌పై చర్యలు తీసుకుంది. యాంత్రిక్స్, దేవాస్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ జరపడానికి ప్రధాని మే 31వ తేదీన సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషన్ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించారు...

ఈ యేడాది 109 'పద్మ' అవార్డులు

న్యూఢిల్లీ,జనవరి 25:   కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 'పద్మ' అవార్డులను ప్రకటించింది. అయిదు పద్మ విభూషణ, 27 పద్మ భూషణ, 77 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.  అవార్డులు పొందిన వారిలో 19 మంది మహిళలున్నారు. పద్మ విభూషణ్ అందుకున్నవారిలో కెజి సుబ్రమణ్యం, శ్రీ మారియో డి మరాండా, వోకల్‌ ఆర్టిస్ట్ భూపెణ్‌ హజారికా, డాక్టర్‌ కాంతిలాల్‌ హస్తిమల్‌, టీవీ రాజేశ్వర్ ఉన్నారు.  పద్మభూషణ్ అందుకున్నవారిలో సినీతారలు షబానా అజ్మీ, ధర్మేంద్ర, మీరా నాయర్‌ ఉన్నారు. పద్మశ్రీ అందుకున్నవారిలో మన రాష్ట్రం నుంచి ముణిరత్నం (సామాజిక సేవ), సయ్యద్‌ మహ్మాద్‌ ఆరీఫ్‌ (బ్యాడ్మింటన్ కోచ్) ఉన్నారు. కాగా ఈ ఏడాదికి భారత రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించలేదు.

అడిలైడ్‌ టెస్ట్ లో టీమిండియా ఎదురీత

అడిలైడ్,జనవరి 25:    అడిలైడ్‌ టెస్ట్ లో  టీమిండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను  7 వికెట్లకు 604 పరుగుల దగ్గర డిక్లేర్‌ చేయడంతో  ఆసీస్‌ భారీ స్కోరుకు సమాధానం చెప్పలేక భారత్ బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. సచిన్‌ 12, గంభీర్‌ 30 పరుగులతో  క్రీజులో ఉన్నారు. సెహ్వాగ్‌ 18, ద్రవిడ్‌ ఒక పరుగు తో  ఔటయ్యారు.  అంతకు ముందు క్లార్క్‌, పాంటింగ్ డబుల్‌ సెంచరీలతో  ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 604 పరుగుల దగ్గర డిక్లేర్‌ చేసింది. 

చిరు-బాలయ్య అభిమానుల మధ్య చిచ్చు

Image
హైదరాబాద్,జనవరి 24:   చిరంజీవి,  బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం వారి  అభిమానుల మధ్య చిచ్చు పెడుతోంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నాయకులు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు చిరంజీవిని సమర్థిస్తూ బాలయ్యను దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగుదేశం నాయకులు బాలయ్యను సమర్థిస్తూ చిరంజీవిని విమర్శిస్తున్నారు. మరోవైపు   సినీ ప్రపంచంలో అగ్ర హీరోలు కావడంతో  వారి అభిమానులు కూడా రెండుగా చీలిపోయి ఘర్షణకు దిగే వాతావరణం ఏర్పడింది. నెల్లూరు, తిరుపతిల్లో ఈ  హీరోల అబిమానులు రెండుగా చీలిపోయి, రోడ్ల మీదికి వచ్చి ఘర్షణ పడ్డారు. చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన అభిమానులు నెల్లూరులోని శ్రీ వివేకానంద సెంటర్‌లో బాలకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని చిరంజీవి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు బాలయ్య అభిమానులు, అటు చిరంజీవి అభిమానులు పోటా పోటీగా నినాదాలు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. పరిస్థితులు అదుపులో ఉంచేందుకు...

రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు

హైదరాబాద్,జనవరి 24:  రాష్ట్రంలో 5 కోట్ల 57 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు.వీరిలో 2,78, 48,792 మంది పురుష ఓటర్లు, 2,79,14,616 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డులలో తొలి స్థానం ఆంధ్రప్రదేశ్ దేనని చెప్పారు. 40 లక్షల నకిలీ ఓటరు కార్డులు తొలగించినట్లు తెలిపారు. 20 మంది హిజ్రాలకు కూడా ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఎపి ఆన్ లైన్ ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తామన్నారు. బుధవారం  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 33 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు.  

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్,జనవరి 24:  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బంధువు, జగన్ సన్నిహితుడు  సునీల్ రెడ్డిని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో  అరెస్ట్ చేసినట్లు సిబిఐ అధికారులు ప్రకటించారు. సునీల్ రెడ్డిని వెంట తీసుకువెళ్లి పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 120 బి. 409, 420,477 సెక్షన్ల కింద ఆయన పై కేసులు నమోదు చేశారు.  అరెస్ట్ విషయాన్ని సునీల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపారు.స్టైలిష్ హోమ్స్ రంగారావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు  సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. విల్లాలను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ జగన్‌కు అందించడంలో లేదా జగన్ సంస్థల్లోకి మళ్లించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని భావిస్తున్నారు.

ఆఖరి టెస్ట్ లోనూ అదే వరస...!

అడిలైడ్,జనవరి 24:  నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో గెలిచిన అసీస్ నాల్గవ, ఆఖరి టెస్ట్ లో కూడా భారత్ జట్టు ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.   అడిలైడ్‌లో మంగళవారం మొదలైన  నాల్గవ టెస్టులో ఆస్టేలియా -మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ప్రస్తుత కెప్టెన్ మైఖెల్ క్లార్క్ వీరోచిత బ్యాటింగ్‌తో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి  3 వికెట్లను కోల్పోయి 335 పరుగులు చేసింది. మొదటి టెస్టులో మాదిరే రికీ పాంటింగ్, మైఖెల్ క్లార్క్ ఇద్దరూ కూడా సెంచరీని నమోదు చేశారు. 84 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను రికీ పాంటింగ్ 137, మైఖెల్ క్లార్క్ 140 పరుగులతో ఆదుకున్నారు.  రికీ పాంటింగ్ 137 పరుగులు చేయడంతో 13, 000 పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అటు క్లార్క్ కూడా కెరీర్‌లో 19వ సెంచరీ చేశాడు. ఈ సిరీస్‌లో అతనికిది రెండో సెంచరీ.

బాలయ్య వర్సెస్ చిరు +లక్ష్మీపార్వతి

Image
హైదరాబాద్,జనవరి 23:    చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, దానిని  తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు. దీనికి ప్రతిగా  బాలయ్య విశాఖలో స్పందించారు. ఒకరు తనను బాలుడు అన్నారని, అలాంటివారు తనను ఓవైపే చూశారని, రెండోవైపు చూడలేదన్నారు. తన మరోరూపం చూపిస్తానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.సి. ఎం. కావాలని కొందరు కలలు కంటున్నారని,  అలాంటివారు ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సాటిరారని బాలకృష్ణ పరోక్షంగా చిరును విమర్శించారు. పార్టీని అమ్మకున్నవాళ్లా నన్ను విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నీవు ఎన్టీఆర్‌కు పుట్టిన కొడుకువేనా?  మరోవైపు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి కూడా బాలయ్యపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ''నీ తండ్రి చావుకు కారణమైన చంద్రబాబుకు మద్దతివ్వాలా? నీకు రోషం, పౌరుషం లేవా? నీవు ఎన్టీఆర్‌కు పుట్టిన కొడుకువేనా? ఎన్టీఆర్‌కు ఇటువంటి సంతానం కలగడం చాలా బాధగా ఉంది’’ అని బాలకృష్ణను ఉద్దేశించి  లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. చిరంజీవి అన్నట్లు బాలకృష్ణది చిన్నపిల్లవాడి మన:స్తతత్వం అన...