టీమిండియా 166/6
అడిలైడ్,జనవరి 27: అడిలైడ్ లో జరుగుతున్న ఆఖరి టెస్ట్ లో విజయం కోసం 500 పరుగులు చేయాల్సివున్న టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆరు వికెట్లు నష్టపోయింది. సెహ్వాగ్ ఒక్కడే రాణించి 62 పరుగులు సాధించగా లక్ష్మణ్ 33 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ లియాన్ మూడు, పేస్ బౌలర్ హారిస్ రెండు వికెట్లు తీసుకున్నారు.
Comments