భారత్ 272 ఆలౌట్, ఆసీస్ 50/3
అడిలైడ్,జనవరి 26: ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 272 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో అత్యధికంగా విరాట్ కోహ్లీ 116 పరుగులు చేయగా , సాహా 35, గంభీర్ 34, సచిన్ 25 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో సిడిల్ 5 వికెట్లు, హిల్‌ఫెనాస్ 3, హారిస్, లియాన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. పాంటింగ్ 1, క్లార్క్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. వార్నర్ 28, కోవాన్ 10, మార్ష్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు. అశ్విన్ 2, జహీర్ 1 వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్ల నష్టానికి 604 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ 382 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది.
Comments