ఈ యేడాది 109 'పద్మ' అవార్డులు
న్యూఢిల్లీ,జనవరి 25: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 'పద్మ' అవార్డులను ప్రకటించింది. అయిదు పద్మ విభూషణ, 27 పద్మ భూషణ, 77 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. అవార్డులు పొందిన వారిలో 19 మంది మహిళలున్నారు. పద్మ విభూషణ్ అందుకున్నవారిలో కెజి సుబ్రమణ్యం, శ్రీ మారియో డి మరాండా, వోకల్ ఆర్టిస్ట్ భూపెణ్ హజారికా, డాక్టర్ కాంతిలాల్ హస్తిమల్, టీవీ రాజేశ్వర్ ఉన్నారు. పద్మభూషణ్ అందుకున్నవారిలో సినీతారలు షబానా అజ్మీ, ధర్మేంద్ర, మీరా నాయర్ ఉన్నారు. పద్మశ్రీ అందుకున్నవారిలో మన రాష్ట్రం నుంచి ముణిరత్నం (సామాజిక సేవ), సయ్యద్ మహ్మాద్ ఆరీఫ్ (బ్యాడ్మింటన్ కోచ్) ఉన్నారు. కాగా ఈ ఏడాదికి భారత రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించలేదు.
Comments