ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత విక్టోరియా అజరెంకా
మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ని విక్టోరియా అజరెంకా గెలుచుకుంది. ఫైనల్స్ లో మారియా షరపోవాపై 6-3, 6-0 తేడాతో అజరెంకా విజయం సాధించింది. అజరెంకా తొలిసారిగా ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని గెలుచుకుంది. ఈ బెలారస్ క్రీడాకారిణి టెన్నిస్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానానికి దూసుకువెళ్లింది. కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విజేతగా లియాండర్ పేస్ జోడీ నిలిచింది. నెంబర్ వన్ సీడ్ బ్రయాన్ బ్రదర్స్ పై 7-6, 6-2 తేడాతో పేస్-జపానెక్ జా విజయం సాధించారు. లియాండర్ పేస్ ఖాతాలో ఇది 13వ గ్రాండ్ స్లామ్ టైటిల్. పేస్ 7 డబుల్స్, 6 మిక్స్ డ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు.
Comments