అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఎదురీత
అడిలైడ్,జనవరి 25: అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 604 పరుగుల దగ్గర డిక్లేర్ చేయడంతో ఆసీస్ భారీ స్కోరుకు సమాధానం చెప్పలేక భారత్ బ్యాట్స్ మెన్లు తడబడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. సచిన్ 12, గంభీర్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెహ్వాగ్ 18, ద్రవిడ్ ఒక పరుగు తో ఔటయ్యారు. అంతకు ముందు క్లార్క్, పాంటింగ్ డబుల్ సెంచరీలతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 604 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది.
Comments