Posts

జగన్ రిమాండ్‌ నవంబర్ 8 వరకు పొడిగింపు

హైదరాబాద్, అక్టోబర్ 25:  అక్రమాస్తుల వ్యవహారంలో వైఎస్ జగన్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 8 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా వచ్చేనెల 8 వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో గురువారం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపరిచారు.

ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్లర్ ఫైనల్‌కు సైనా

పారిస్, అక్టోబర్  25:  వైల్డ్ కార్డు ఎంట్రీ సాధించిన సైనా ఫ్రెంచ్ ఓపెన్‌లో తన జోరు కొనసాగిస్తోంది.  రెండో రౌండ్‌లో థాయిలాండ్ క్రీడాకారిణి సప్పిరి పై 21-16, 21-13 తేడాతో సైనా విజయం సాధించి క్వార్లర్ ఫైనల్‌కు చేరుకుంది.  ఒలింపిక్ విజయం తర్వాత ఆడిన తొలి టోర్నీ డెన్మా ర్క్ ఓపెన్‌ లోనే చాంపియన్‌గా నిలిచి దూకుడు మీద ఉన్న  సైనా నెహ్వాల్ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను కూడా నెగ్గి ఈ ఏడాది ఐ దో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతోంది. 

వార్తాప్రపంచం వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు...

Image

'దీపం' లబ్దిదార్లకు అదనపు సిలిండర్లు

హైదరాబాద్ , అక్టోబర్ 23:   ప్రజలకు  ప్రస్తుతం ఇస్తున్న ఆరు గ్యాస్ సిలిండర్లకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు సిలెండర్లను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే దీపం పథకం కింద కనెక్షన్లు ఉన్నవారికే ఈ అదనపు  మూడు సిలిండర్లు లభిస్తాయని పౌర సరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్నా సబ్సిడీతో అదనపు సిలిండర్లు ఇవ్వలేమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

ఎడ్యూరప్ప సొంత కుంపటి...

బెంగళూరు , అక్టోబర్ 23:   కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ ఎడ్యూరప్ప బీజేపీ నుంచి వైదొలగాలని  నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ మనగడపై అనుమానాలు వ్యక్తం చేశారు. 'బీజేపీ, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. డిసెంబర్ 10 తేదిన ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు  యోడ్యురప్ప చెప్పారు. 

ఉరికి చేరువలో కసబ్...

Image
న్యూఢిల్లీ, అక్టోబర్ 23:  ముంబై కాల్పుల ఘటనలో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ పెట్టుకున్న  క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి భవన్‌కు సమాచారం అందించింది. కసబ్ మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించి, ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కసబ్ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చాలని ఇంతకు ముందు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది.

తెలంగాణలో మొదలైన చంద్రబాబు పాదయాత్ర...

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన  వస్తున్నా... మీకోసం పాదయాత్ర సోమవారం తెలంగాణలోకి అడుగుపెట్టింది.  జిల్లాలోని రాజోలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, ఈ విషయంపై తాము ఎవరితోనైనా చర్చకు సిద్ధమని అన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు కేంద్రమే పరిష్కారం చూపాలని ఆయన అన్నారు.  సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నానని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు అండగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీ, మలి సంతకం మద్యం గొలుసు దుకాణాల రద్దు ఫైళ్ల మీదనే అని చెప్పారు. సబ్సిడీపై 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని చెపూకొచ్చారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం : రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ లకు పదవులు

హైదరాబాద్, అక్టోబర్ 22:  ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీకి  శ్రీకారం చుట్టారు. తొలి విడతగా ఇద్దరు మాజీ మంత్రులకు పదవులు దక్కాయి. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేదురుమల్లి రాజ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్ నియమితులయ్యారు. రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిలో రాజ్యలక్ష్మి నెల్లూరు జిల్లాకు చెందినవారు కాగా, మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందినవారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. 2004 ఎన్నికలలో  కాంగ్రెసు విజయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది మందిని మాత్రమే నామినేటెడ్ పోస్టులు వరించాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య కూడా నామమాత్రంగానే పోస్టులను భర్తీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కాలం నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు సాగించారు. నామినెటెడ్ పోస్టుల భర్తీని విడతలవారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం....

విజయమ్మ ' బైబిల్ ' వివాదం...

Image
 హైదరాబాద్ , అక్టోబర్ 21:   వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాజకీయ పార్టీ సభలకు, సమావేశాలకు, యాత్రలకు బైబిల్ చేత పట్టుకొని వెళ్లడం వివాదాస్పదమవుతోంది. విజయమ్మ రాజకీయ లబ్ధి కోసం బైబిల్ చేత పట్టుకొని వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ మొదటి నుండి విమర్శలు చేస్తోంది. తాజాగా, జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో విజయమ్మ బైబిల్ చేబూనటం వివాదస్పదమైంది. రాజకీయ కార్యక్రమాలకు  ఆమె బైబిల్‌ను తీసుకు రావడం ఒకరకంగా తెలుగుదేశం శ్రేణులు  ఆరోపిస్తున్నాయి. బైబిల్ చేతపట్టుకొని రాజకీయ యాత్రలకు రావడం ద్వారా విజయమ్మ ఒక  వర్గాన్ని తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని  వారు విమర్శిస్తున్నారు. అయితే విజయమ్మ మాత్రం బైబిల్ రాజకీయాలను ఖండించారు. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడకు వెళ్లినా బైబిల్‌ను తీసుకు వెళ్తానని, బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మత ప్రచారం చేసినట్లు కాదని ఆమె చెప్పా...

యష్ చోప్రా నో మోర్...

Image
ముంబై, అక్టోబర్ 21:  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత యష్ చోప్రా ఆదివారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన కొద్ది రోజుల నుంచి డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారు. షారుఖ్ ఖాన్ తో తీసిన జబ్ తక్ హై జాన్ ఆయన చివరి చిత్రం.  సెప్టెంబర్ 27న  యష్ చోప్రా తన 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. గతంలో ఆయన  'షోలే- ద మేకింగ్ ఆఫ్ ఎ క్లాసిక్' పుస్తకం  జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకొని, పదివేల కాపీలు అమ్ముడయింది. యష్ చోప్రా దర్శకత్వం వహించిన 'దూల్ కా ఫూల్', వక్త్, డాగ్, దీవార్, కభీ కభీ, సిల్ సిలా, చాందిని, డర్, దిల్ తో పాగల్ హై, వీర్ జరా చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. 

కింగ్‌ఫిషర్ లెసైన్స్ నిలుపుదల

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు తాజాగా పౌరవిమానయాన డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఏ) షాకిచ్చింది. లెసైన్స్ (షెడ్యూల్డ్ ఆపరేటర్ పర్మిట్-ఎస్‌వోపీ) ను నిలుపుదలచేస్తూ (సస్పెన్షన్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తిరిగి ఆదేశాలు జారీ దీనితో చేసేవరకూ సస్పెన్షన్ అమలులో ఉంటుందని పౌరవిమానయాన శాఖ అధికారులు పేర్కొన్నారు. వెరసి తొమ్మిదేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కింగ్‌ఫిషర్... తొలిసారి విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితిలో పడింది. మూడు వారాలుగా లాకౌట్‌లో కొనసాగుతున్న కంపెనీ ఇటు ఆర్థికంగానూ, అటు నిర్వహణపరంగానూ ఎలాంటి ఆచరణీయ ప్రణాళికనూ సిద్ధం చేయలేకపోవడంతో డీజీసీఏ ఈ చర్యలు చేపట్టింది. లెసైన్స్ సస్పెన్షన్‌తో కింగ్‌ఫిషర్ నెట్‌వర్క్ తోపాటు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా జరిగే అన్ని రకాల బుకింగ్‌లూ నిలిచిపోనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా, భద్రతా చర్యలలో భాగంగా డీజీసీఏ కింగ్‌ఫిషర్ లెసైన్స్ ను నిలుపుదల చేసిందని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. ఇంజనీర్లు సమ్మెలో ఉన్నందున విమానాల నిర్వహణ, తత్సంబంధిత సేవలను చేపట్టడంలేదని తెల...

డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా

ఒడెన్స్ ,అక్టోబర్ 18:  డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ మితాని మినత్సు (జపాన్) పై 21-15, 21-14 తో సైనా గెలిచింది.

పవర్ కోసం వీధిన పడ్డ వై.ఎస్. ఇంటి పడుచులు !

Image
కడప,అక్టోబర్ 18:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం మధ్యాహ్నం తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు.  వైయస్సార్ ఘాట్ నుండి ప్రారంభమైన షర్మిల యాత్రలో తొలి రోజున జగన్ సతీమణి భారతి రెడ్డి, తల్లి విజయమ్మ పాల్గొన్నారు. షర్మిల సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు కిలోమీటర్లు నడిచారు. ట్రిపుల్ ఐటి, వీరగట్టుపల్లె, కుమ్మరాంపల్లె మీదుగా ఆమె యాత్ర కొనసాగింది.  పార్టీ నేతలు శోభా నాగి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, రోజా తదితరులు కూడా షర్మిల వెంటఉన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి వారు పాదయాత్ర చేపట్టారు.  పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో విజయమ్మ, షర్మిల భారీ బహిరంగ సభలో మాట్లాడారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కై జగన్‌ను జైలుకు పంపించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. షర్మిల తనను  దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్ సోదరిగా పరిచయం చేసుకున్నారు. తన అన్న తరఫున తాను పాదయత్ర చేస్తున్నట్లు షర్మిల చెప్పారు. రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కా...

గడ్కరీ పరమ అవినీతిపరుడు..చిట్టా విప్పిన కేజ్రీవాల్

Image
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: : అవినీతి వ్యతిరేక ఉద్యమం చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతి చిట్టా విప్పారు.  కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను తొలి విడతగా టార్గెట్ చేసిన కేజ్రీవాల్ ఈసారి గడ్కరీ అవినీతి ని బయటపెట్టారు. గడ్కరీని  రాజకీయ నాయకుడు అనడం కంటే మంచి వ్యాపారవేత్త అనడం సబబు అన్నారు. మహారాష్ట్రలో గడ్కరీకి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉందని ఆరోపించారు. మహారాష్ట్ర నీటిపారుదల కుంభకోణంలో గడ్కరీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. శరద్ పవార్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గడ్కరీయే చెప్పారన్నారు. గతంలో ప్రాజెక్టు కోసమని సేకరించిన భూమిలో చాలా మిగిలి పోయిందని, మిగిలిన ఆ భూమిని తనకు అప్పగించాలని రైతులు 2002లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారని, అయితే ప్రభుత్వం మాత్రం వారి విజ్ఞప్తులను పట్టించుకోలేదన్నారు. 2005లో గడ్కరీ ఆ భూములను తనకు ఇవ్వాల్సిందిగా లేఖ రాస్తే విలాస్ రావు దేశ్ ముఖ్ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. నాగపూర్ రైతుల భూములను గడ్కరీకి ప్రభుత్వం ధారాదత్తం చేసిందన్నారు. రైతుల ప్రాణాలు ఫణంగా పెట్టి గడ్కరీ మహా ప్రభుత్వం నుండి ప్రయోజనం ...

సచిన్‌కు ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో సభ్యత్వం

న్యూఢిల్లీ, అక్టోబర్ 16  మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సచిన్ కు ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా లో సభ్యత్వాన్ని కల్పించింది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రధాని జూలియా గిల్లార్డ్  ప్రకటన చేశారు.  త్వరలో భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్యాబినెట్‌ మినిస్టర్‌ సైమన్‌ క్రీన్‌ ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తారు. అసాధారణ సేవలందించిన ప్రముఖులను లేదా ఆస్ట్రేలియా పౌరులను ఈ గౌరవంతో సత్కరిస్తారు. ఆరు గ్రేడ్లు ఉన్న ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో సచిన్‌ను సభ్యత్వంతో గౌరవించనున్నారు. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న క్రికెటర్లలో బ్రియాన్‌ లారా ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన క్లైవ్‌ లాయిడ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో ఆఫీసర్‌గా గౌరవం పొందారు.

తెలంగాణ ఒక్కటే సమస్యా ? వాయలార్

న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : దేశంలో తెలంగాణ ఒక్కటే సమస్య కాదని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి మంగళవారం అన్నారు.  తెలంగాణపై చర్చల ప్రక్రియ ఆగిపోలేదని,  అందరితోనూ చర్చిస్తున్నామని,   అయితే చర్చలు ఎప్పటిలోగా ముగుస్తాయో ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు.  కేంద్రం, కాంగ్రెసు పార్టీ కూడా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలనే  ఉద్దేశం తో  ఉన్నాయని  చెప్పారు. 

జీవ వైవిధ్య పరిరక్షణకు 50 మిలియన్ డాలర్లు: ప్రధాని

Image
హైదరాబాద్, అక్టోబర్ 16: జీవ వైవిధ్య సదస్సుకు నాయకత్వం వహించే రెండేళ్ళ కాలం లో భారత్  ఇందుకు సంభందించిన ప్రాజెక్ట్ పై 50 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని  ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్  చెప్పారు.  జీవ వైవిధ్య పరిరక్షణకు సంస్థాగత వ్యవస్థ పటిష్టతపై ఈ నిధులు వెచ్చిస్తామన్నారు. హైదరాబాదులో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో మంగళవారం నాడు ప్రధాని పాల్గొన్నారు. జీవ వైవిధ్య ప్రాధాన్యత భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని  మన్మోహన్ సింగ్  అన్నారు.  జీవ వైవిధ్య ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు కూడా  గుర్తిస్తున్నాయని చెప్పారు. పర్యావరణ ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన క్రమంగా ఏర్పడుతోందన్నారు.  జీవ వైవిధ్యం పై 2010 లక్ష్యాలను చేరుకోలేక పోయామని,  ప్రకృతి నుండి కనుమరుగు అవుతున్న జంతువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పర్యావరణమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు వాడుతున్న విత్తనాల పేటెంట్ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. భారత దేశంలో 600 పర్యావరణ పరిరక్షణ...