Posts

సివిల్ సర్వీస్‌లో ఆప్షనల్ ఎత్తివేత

హైదరాబాద్,అక్టోబర్ 17: దేశంలో అత్యున్నత ఉద్యోగ కేటగిరిలో ఒకటిగా నిలిచే సివిల్ సర్వీస్ పరీక్షలో సంచలన మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీస్ పరీక్షలో పేపర్-2 విభాగంలో ఆప్షనల్ పేపర్‌ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షనల్ పేపర్ స్థానంలో కూడా జనరల్ స్టడీస్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.

అమెరికాలో సత్యనారాయణ వ్రత మహోత్సవం

అన్నవరం,అక్టోబర్ 17: : అమెరికాలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన తెలుగువారు, ఇప్పుడు మరో ఆద్యాత్మిక వేడుకలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. భగవంతుని భక్తుల చెంతకు చేర్చే సదుద్దేశంలో భాగంగా అన్నవరం దేవస్థానం, అమెరికాలోని తెలుగువారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం దేవస్థానం తరపున వేద పండితులతో కూడిన నిర్వాహక కమిటిని అమెరికా పంపుతోంది. ఈ కమిటి 22వ తేదీ, పౌర్ణమి రోజు మోర్గాన్‌విల్లే గురువాయురప్ప దేవాలయంలో తొలి వ్రతం నిర్వహించనున్నది. అదే విధంగా అమెరికాలోని మొత్తం తొమ్మిది నగరాల్లోని నిర్దేశించిన దేవాలయాల్లో బృందాల వారీగా సత్యనారాయణ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం తెలిపింది. .ఒక్కోనగరంలో మూడేసి రోజుల చొప్పున వ్రత నిర్వాహక కమిటి విడిది చేస్తుంది.. వత్రనిర్వహణ కోసం రిజిస్టర్ చేయించుకున్న భక్తులకు ఆలయం తరపున స్వామి వారి డాలర్, కుంకుమ, అక్షింతలు, లామినేటెడ్ ఫోటో, ఉత్తరీయం, బ్లౌజ్ పీస్ ఇస్తారు... న్యూజెర్సీ (అక్టోబర్ 21,22,23), వాషింగ్టన్ డీసీ (అక్టోబర్ 24,25,26), శాన్ జోసె (అక్టోబర్ 28,29,30), ఎల్‌ఏ (అక్టోబర్ 31, నవంబర్ 1,2), టెక్సాస్, ఆస్టిన్ (...

ఇంటర్‌నెట్ తో నడుంనొప్పి...

లండన్,అక్టోబర్ 17: గంటల తరబడి అదే పనిగా ఇంటర్నెట్ కు  అతుక్కుపోతే నడుంనొప్పి ఖాయమంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా మధ్య వయసు మహిళ లు దీని బారిన ఎక్కువగా పడుతున్నారని వారంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లపై ఎక్కువ సమయం గడుపుతూ నడుంనొప్పి కొనితెచ్చుకుంటున్నారట. ఇంటర్‌నెట్‌లో ఎక్కువసేపు గడుపుతున్న ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురు నడుంనొప్పితో ఇబ్బందిపడుతున్నారని  ఈ అధ్యయనంలో తేలింది.  . ఇంటర్నెట్ కు అతుక్కుపోయి నడుంనొప్పితో బాధపడుతున్న వారు సామాజికంగా, వృత్తిపరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిజియోథెరపిస్ట్ సామి మార్గో పేర్కొన్నట్టు ‘డైలీ ఎక్స్‌ప్రెస్’ కధనం. 

న్యూజిలాండ్‌లో భారత సుగంధ ద్రవ్యమేళా

కోచి,అక్టోబర్ 17:   అంతర్జాతీయ విపణిలో నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు లభించే దేశంగా  పేరున్నభారత్‌ తన సుగంధ వీచికలను విశ్వవ్యాప్తం చేసేందుకు వివిధ దేశాల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేస్తుండడం ఎంతో కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో నవంబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు ‘సుగంధ ద్రవ్యోత్సవం’ నిర్వహించ తలపెట్టారు. అక్కడి ఇండియన్ హై కమిషన్ సహకారంతో భారత సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక మేళాలో సుగంధ ద్రవ్యాల ప్రదర్శన ఉంటుంది. ఈ మేళా సందర్శన ద్వారా వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు భారత్ నుంచి విరివిగా వీటిని దిగుమతి చేసుకునే వీలుంది. 

ముంబై వాణిజ్య సదస్సుకు ఒబామా

వాషింగ్టన్,అక్టోబర్ 17: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే నెల 6న ముంబైలో వాణి జ్య సదస్సులో పాల్గొననున్నారు. భారత్, అమెరికా కార్పొరేట్ లీడర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) ఈ సదస్సు ఏర్పాటు చేసింది. వచ్చే నెల భారత పర్యటనకు రానున్న ఒబామా ముందుగా ఇండియా వాణిజ్య రాజధాని ముంబైలో ఆగనున్నారు. వైట్‌హౌస్ సూచన మేరకు ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు యూఎస్‌ఐబీసీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా-భారత వ్యాపార, పారిశ్రామిక వేత్తల సదస్సు నవంబర్ 6న (జరుగుతుందని తెలిపాయి. నాలుగు గంటలపాటు సాగే ఈ సమావేశంలో రెండు దేశాల్లో దీర్ఘకాల వ్యాపారవకాశాలపై చర్చించనున్నారు. ఒబామా ప్రత్యేక ప్రసంగంతో సదస్సు ముగుస్తుంది. అమెరికా వాణిజ్య మంత్రి గారీ లాక్‌కీ, భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా సదస్సులో ప్రసంగిస్తారు. యూఎస్‌ఐబీసీలో పెప్సికో, బోయింగ్, వాల్ మార్ట్, లక్‌హీద్ మార్టిన్ వంటి అగ్రశేణి కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. వీటిలో 375 కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఇండియాతో వాణిజ్య సంబంధాల పటిష్టతతో పాటు తమ దేశంలో ఉద్యోగాల కల్పన, స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉన్నందునే ...

భారత వైమానిక దళంతో ఒప్పందంపై అమెరికా కన్ను

వాషింగ్టన్,అక్టోబర్ 17:  భారత వైమానిక దళంతో వందలాది కోట్ల డాలర్ల ఒప్పందంపై అమెరికా దృష్టి సారిస్తోంది. భారత వైమానిక దళానికి బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే మీడియం సైజు యుద్ధ విమానాల సరఫరా ఒప్పందం కుదిరినట్లయితే అమెరికన్లకు కొత్తగా 27వేల వరకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావంతో అమెరికాలో నిరుద్యోగం సమస్యగా మారిన తరుణంలో ఈ ఒప్పందం అమెరికా సర్కారులో ఆశలు రేకెత్తిస్తోంది. భారత వైమానిక దళానికి యుద్ధ విమానాలు సరఫరా చేసేందుకు దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల (రూ. 44 వేల కోట్లు) టెండర్‌ను దక్కించుకోవడానికి అమెరికాకు చెందిన బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. 

కామన్‌వెల్త్ క్రీడల్లో నూటొక్క పతకాలతో సత్తా చూపిన భారత్

న్యూడిల్లీ ,అక్టోబర్ 14: కామన్‌వెల్త్ క్రీడల ప్రారంభోత్సవాన్నే కాదు, ముగింపు ఉత్సవాలను కూడా భారత్ గురువారంనాడు ఘనంగా నిర్వహించింది. భారత క్రీడాకారులతో పాటు విదేశీ క్రీడాకారులు కూడా మనసారా ఆనందిస్తూ నృత్యాలు చేస్తూ ఆతిథ్య దేశమైన భారత్‌ను శ్లాఘించారు. పన్నెండు రోజుల క్రీడలకు గురువారం రాత్రి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం తెర దించింది. కామన్‌వెల్త్ క్రీడల్లో నూటొక్క పతకాలతో భారత్ సత్తా చూపింది! భవిష్యత్తుపై ఆశలు సజీవంగా నిలిపింది! భారత పతకాల పట్టికలో 38 పసిడి పతకాలే. తెలుగు నేల కూడా తన వంతు పంట పండించింది. గగన్ నారంగ్, శరత్ కమల్, గుత్తా జ్వాల, పారుపల్లి కశ్యప్, సత్తి గీత, అబ్దుల్ ఖురేషీ... పతకవేటలో సహకారం అందించారు. రెండో స్థానంపై చివరి రోజు ఇంగ్లండ్ నుంచి ఎదురైన ముప్పును తప్పించిన తెలుగు తేజం సైనా నెహ్వాల్.. గోల్డెన్ ఫినిష్‌తో పట్టికలో భారత్‌కు ద్వితీయ స్థానం కట్టబెట్టింది! తొలుత అవినీతి ఆరోపణల సుడిగుండాల్లో ఎదురీదినా... నిర్వహణపై కమ్ముకున్న అనుమాన మేఘాల నడుమ ఉక్కిరిబిక్కిరైనా.. కామన్‌వెల్త్ క్రీడలు ఎట్టకేలకు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.ఆడంబరంగా సాగిన ఆరంభ వేడుకలను మరిపించేలా.. వీడ...

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి ‘కల్పెని’

కొచ్చి,అక్టోబర్ 14: భారత నౌకాదళం అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చిచేరింది. స్వదేశీ పరిజ్ఙానంతో నిర్మించిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కల్పెని గురువారం జలప్రవేశం చేసింది. దక్షిణ నౌకాదళం తీర ప్రాంత నిఘా సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా దీనిని తయారుచేశారు. కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ జె. చలమేశ్వర్ ఈ నౌకను జలప్రవేశం చేయించారు. దక్షిణ నౌకాదళ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కమాండర్ సుభాల్ నాథన్ ఆధ్వర్యంలో కొచ్చి స్థావరంగా నడిచే కల్పెనిలో ముగ్గురు అధికారులు, 38 మంది సిబ్బంది ఉంటారు. మూడు శక్తివంతమైన వాటర్ జెట్ ఇంజిన్లు గల ఈ నౌక 35 నాటికల్ మైళ్ల వేగాన్ని అధిగమించగలదు. మొదటి శ్రేణి ఫాస్ట్ అటాక్ నౌక ‘బంగారం’ను అభివృద్ధిపర్చి కల్పెనిని దేశీయంగా తయారుచేశారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌యార్డ్‌లో నిర్మించిన 10 నౌకల బ్యాచ్‌లో ఇది ఏడోది. కల్పెని జలప్రవేశం దేశీయ యుద్ధనౌకల నిర్మాణంలో ఓ మైలురాయి వంటిదని కొచ్చిలోని నేవల్ ప్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

చిలీ గని కార్మికులందరికీ విముక్తి

శాంటియాగో,అక్టోబర్ 14: చిలీ గనిలో 70 రోజులపాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పది వారాలపాటు గనిలో బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులను ప్రభుత్వం విజయవంతంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చింది. తద్వారా వారందరికీ స్వేచ్ఛావాయువులను అందించింది. దీంతో కార్మికులంతా గురువారం ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాప్సూల్ ద్వారా బుధవారం 17 మంది కార్మికులు బయటపడగా గురువారం మిగిలిన 16 మంది క్షేమంగా బయటకొచ్చారు. దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా సమక్షంలో రెండురోజులపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో లూయిస్ ఉర్జువా అనే కార్మికుడు శ్రేయోభిలాషుల కరతాళధ్వనుల మధ్య జాతీయ పతాకాన్ని భుజాన కప్పుకొని చిట్టచివరగా క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చాడు. అతన్ని కూడా పినెరా ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. దీంతో కార్మికులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఉద్విగ్న క్షణాలను పంచుకున్నారు. కార్మికులు తిరిగి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టినందుకు సూచికగా 33 బెలూన్లను గాల్లోకి ఎగరేశారు. ఈ సహాయ చర్యలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్ అధ్యక్షులు ఒబామా, నికోలస్ స...

రెండో సారి 'పరీక్ష’లోనూ నెగ్గిన యడ్యూరప్ప : 18న హైకోర్టు తీర్పుకు లోబడే బలపరీక్ష ఫలితం

బెంగళూరు,అక్టోబర్ 14: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ‘రెండో పరీక్ష’లో నెగ్గారు. గురువారం శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో గెలుపొంది సర్కారును నిలబెట్టుకున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి గెలుపేనా లేక మూన్నాళ్ల ముచ్చటేనా అన్న విషయం 18న హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటుంది. అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందా చెల్లదా అన్న అంశాన్ని హైకోర్టు తేల్చిచెప్పే వరకూ యడ్యూరప్పకు టెన్షన్ తప్పదు. అనర్హత చెల్లుతుందని కోర్టు ఆమోదిస్తే.. బీజేపీ సర్కారుకు ఇబ్బంది లేదు. ఒకవేళ చెల్లదని చెప్తే మాత్రం.. ముచ్చటగా ‘మూడో పరీక్ష’ను ఎదుర్కోవాల్సి రావచ్చు. గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ సూచన మేరకు గురువారం ఏర్పాటు చేసిన శాసనసభ ప్రత్యేక సమావేశంలో యడ్యూరప్ప ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 106, వ్యతిరేకంగా 100 ఓట్లు వచ్చాయి. స్పీకర్ కె.జి.బోపయ్య తొలుత మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు ఓటింగ్ నిర్వహించారు. ప్రతి వరుసలోని శాసనసభ్యులు వంతుల వారీగా తమ స్థానాల వద్ద లేచి నిల్చోగా శాసనసభ సచివాలయం అధికారులు వారిని లెక్కించ...

యడ్యూరప్పకు మరోసారి బల పరీక్ష

బెంగుళూరు, అక్టోబరు 12 : కర్నాటక రాజకీయం కొత్త మలుపు తిరిగింది. 14వ తేదీన (గురువారం) కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరోసారి బల నిరూపణ చేసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్ఆర్ భరధ్వాజ్ ఆదేశించారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష న్యాయసమ్మతంగా లేదని, కనుక అది చెల్లదని గవర్నర్ ఒక లేఖలో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్ప సర్కార్ ఇరకాటంలో పడింది. కాగా,తమ శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ కె.జి.బోపయ్య తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 11 మంది బీజేపి ఎమ్మెల్యేలు, 5 గురు ఇండిపెండెంట్లు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. 11 మంది బీజేపి ఎమ్మెల్యేలు ఒక పిటీషన్, 5 గురు ఇండిపెండెంట్లు విడివిడిగా పిటీషన్లు దాఖలు చేయడం గమనార్హం.ఇందులో బీజేపి ఎమ్మెల్యేలు తమకు నిబంధనల ప్రకారం 7 రోజుల ముందుగా నోటీసు జారీ చేయాల్సి ఉండగా ఈ నెల 7న నోటీస్ జారీ చేసి 10న సాయంత్రంలోపు సమాధానం చెప్పాలని ఆదేశించడం దారుణమని ఆరోపించారు. స్పీకర్ ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని ఇవి చెల్లనేరవని ఆరోపించారు. మరో వైపు 5 గురు ఇండిపెండెంట్ల వాదన మరో విధంగా ఉంది. తాము స్వతంత్ర శాసనసభ్యులుగా విజయం సాధించామని తమకు నోటీసుల...

కామన్వెల్త్ ఫైనల్లోకి భారత పురుషుల హాకీ జట్టు

న్యూఢిల్లీ,అక్టోబర్ 12: కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా  అడుగుపెట్టి కొత్త రికార్డు లిఖించింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను పెనాల్టీ షూటవుట్ ద్వారా ఓడించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 5-4 గోల్స్‌తో తేడాతో భారత్ గెలుపొందింది. పైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. 

వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

ముంబై,అక్టోబర్ 12:: ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌లో పాల్గొనే జట్టును బీసీసీఐ  ప్రకటించింది. గాయం కారణంగా గంభీర్, సెహ్వాగ్, ఇషాంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. సచిన్, హర్భజన్ సింగ్, జహీర్‌ఖాన్, ప్రజ్ఞాన్ ఓజా విశ్రాంతి కల్పించారు. జట్టు: ధోని, రైనా, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, రవీంద్ర జడేజా, యువరాజ్, మురళీ విజయ్, శిఖర్ థావన్,సౌరభ్ తివారీ, మునాఫ్ పటేల్, ప్రవీణ్ కుమార్, ఆశిష్ నెహ్రా, అశ్విన్.

ఫైనల్లో సైనా నేహ్వాల్

న్యూఢిల్లీ,అక్టోబర్ 12:  కామన్‌వెల్త్ క్రీడల్లో భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. స్కాట్‌లాండ్‌కు చెందిన సుసాన్‌పై 21-10, 21-17 స్కోర్ తేడాతో సైనా విజయం సాధించింది.

భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం

న్యూఢిల్లీ,అక్టోబర్ 12: : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు తాత్కాలిక సభ్యత్వం లభించింది. జపాన్ స్థానంలో భారత్‌కు చోటు లభించింది. కాగా,తాత్కాలిక సభ్య దేశాలకు భద్రతా మండలిలో ఓటు వేసే హక్కు వుండదు.

ఐసీసీ ‘క్రికెట్ ఆఫ్ ఇయర్’గా సచిన్

బెంగళూరు,అక్టోబర్ 6:  ఐసీసీ క్రికెట్ ఆఫ్ ఇయర్ అవార్డును భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ గెల్చుకున్నాడు. పీపుల్స్ ఛాయిస్ పురస్కారం కూడా సచిన్‌నే వరించింది. ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ ఎలెవన్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ధోనీ ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డీ విలియర్స్ ఈ ఏడాది వన్డే ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెల్చుకుంది.

కామన్వెల్త్ : భారత్ ఖాతాలో పది స్వర్ణాలు

న్యూఢిల్లీ,అక్టోబర్ 5: : కామన్వెల్త్ ఆటల పోటీలలో భారత్ ఖాతాలో పది స్వర్ణ పతకాలు చేరాయి. 55 కిలోల రెజ్టింగ్ విభాగంలో రాజేంద్ర కుమార్ కు స్వర్ణపతకం లభించింది. 58 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రేణుబాల చానుకు స్వర్ణ పతకం లభించింది. 50 మీటర్ల ఫిస్టల్ ఈవెంట్'లో ఓంకార్ సింగ్ స్వర్ణ పతకం సంపాధించాడు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్‌లో గగన్ నారంగ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, అభినవ్ బింద్రా రజితాన్ని సాధించాడు.

సంక్షోభంలో కర్ణాటక బీజేపీ సర్కార్

బెంగళూరు,అక్టోబర్ 6: : ఈ నెల 11న కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంటారు. 19 మంది శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకోవడంతో యడ్యూరప్ప ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప గవర్నర్ హెచ్.ఆర్. భరధ్వజ్'ని కలసి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని వివరించారు. అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడుతూ 11న శానస సభలో తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. బలనిరూపణలో తాను తప్పనిసరిగా నెగ్గుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు  నలుగురు అసమ్మతి మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లు యడ్యూరప్పప్రకటించారు. వేటు పడినవారిలో శివరాజ్ తంగడిగి, వెంకటరామప్ప, నరేంద్రస్వామి, సుథాకర్‌లు ఉన్నారు. అలాగే మరో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను ఒప్పించి రాజీనామా చేయిస్తామన్నారు. దీంతోపాటు ఆరుగురు కొత్తమంత్రులను కేబినేట్‌లోకి చేర్చుకుంటామని సీఎం పేర్కొన్నారు.  

రైల్వే ఉద్యోగులకు 77 రోజుల బోనస్‌

న్యూఢిల్లీ,అక్టోబర్ 5:   దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు శుభవార్త. రైల్వేలలోని నాన్ గెజిటెడ్ సిబ్బందికి ఉత్పాదకత ఆధారంగా 77 రోజుల బోనస్‌ను కేంద్రం దీపావళి కానుకగా ప్రకటించింది. రైల్వేశాఖ ఈ మేరకు చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.  కాగా, ఉత్పాదకత ఆధారంగా రైల్వే శాఖ ప్రకటించిన బోనస్ మొత్తం ఇదే అత్యధికం. రైల్వేలలోని 12.92 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 77 రోజుల బోనస్ చెల్లించేందుకు కేంద్రంపై రూ.1065.42 కోట్ల మేరకు భారం పడుతుందని అంచనా. బోనస్ పొందడానికి ఉద్యోగుల వేతన పరిమితిని రూ.3,500గా నిర్ణయించారు.

టెస్ట్ ట్యూబ్ బేబీ పితామహునికి నోబెల్ బహుమతి

Image
స్టాక్‌హోమ్, అక్టోబర్ 4 : సంతానం లేనివారికి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా సంతానం కల్పించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్‌కు 2010వ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది. రాబర్ట్ 1950 వ దశకంలో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియపై విశేష కృషి చేశారు.  ఒకే ఒక్కడుగా ఆయన చేసిన కృషి వల్ల 1978 జూలైలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది.  ఆయన ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐ.వి.ఎఫ్.) ప్రక్రియను కనిపెట్టడంతో సంతానం లేని తల్లిదండ్రులలో పెక్కుమందికి ఊరట లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నట్టు అంచనా.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆరు దశాబ్దాల క్రితం పరిశోధనలు ప్రారంభించిన రాబర్ట్ ఎడ్వర్డ్స్ 1970 వ దశకంలో ప్యాట్రిక్ స్టెప్‌టో అనే గైనకాలజిస్టు సాయంతో తమ కృషి కొనసాగించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది నిస్సంతులు సంతానం పొందగలిగారు. ఆ పరిశోధనలను గుర్తిస్తూ నోబెల్ కమిటీ రాబర్ట్‌కు ఇప్పుడు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. ప్రస్తుతం రాబర్ట్ వయస్సు 85 సంవత్సరాలు.