టెస్ట్ ట్యూబ్ బేబీ పితామహునికి నోబెల్ బహుమతి

స్టాక్‌హోమ్, అక్టోబర్ 4 : సంతానం లేనివారికి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా సంతానం కల్పించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్‌కు 2010వ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది. రాబర్ట్ 1950 వ దశకంలో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియపై విశేష కృషి చేశారు.  ఒకే ఒక్కడుగా ఆయన చేసిన కృషి వల్ల 1978 జూలైలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది.  ఆయన ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐ.వి.ఎఫ్.) ప్రక్రియను కనిపెట్టడంతో సంతానం లేని తల్లిదండ్రులలో పెక్కుమందికి ఊరట లభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నట్టు అంచనా.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆరు దశాబ్దాల క్రితం పరిశోధనలు ప్రారంభించిన రాబర్ట్ ఎడ్వర్డ్స్ 1970 వ దశకంలో ప్యాట్రిక్ స్టెప్‌టో అనే గైనకాలజిస్టు సాయంతో తమ కృషి కొనసాగించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది నిస్సంతులు సంతానం పొందగలిగారు. ఆ పరిశోధనలను గుర్తిస్తూ నోబెల్ కమిటీ రాబర్ట్‌కు ఇప్పుడు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. ప్రస్తుతం రాబర్ట్ వయస్సు 85 సంవత్సరాలు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు