అమెరికాలో సత్యనారాయణ వ్రత మహోత్సవం
అన్నవరం,అక్టోబర్ 17: : అమెరికాలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన తెలుగువారు, ఇప్పుడు మరో ఆద్యాత్మిక వేడుకలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. భగవంతుని భక్తుల చెంతకు చేర్చే సదుద్దేశంలో భాగంగా అన్నవరం దేవస్థానం, అమెరికాలోని తెలుగువారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం దేవస్థానం తరపున వేద పండితులతో కూడిన నిర్వాహక కమిటిని అమెరికా పంపుతోంది. ఈ కమిటి 22వ తేదీ, పౌర్ణమి రోజు మోర్గాన్విల్లే గురువాయురప్ప దేవాలయంలో తొలి వ్రతం నిర్వహించనున్నది. అదే విధంగా అమెరికాలోని మొత్తం తొమ్మిది నగరాల్లోని నిర్దేశించిన దేవాలయాల్లో బృందాల వారీగా సత్యనారాయణ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం తెలిపింది. .ఒక్కోనగరంలో మూడేసి రోజుల చొప్పున వ్రత నిర్వాహక కమిటి విడిది చేస్తుంది.. వత్రనిర్వహణ కోసం రిజిస్టర్ చేయించుకున్న భక్తులకు ఆలయం తరపున స్వామి వారి డాలర్, కుంకుమ, అక్షింతలు, లామినేటెడ్ ఫోటో, ఉత్తరీయం, బ్లౌజ్ పీస్ ఇస్తారు... న్యూజెర్సీ (అక్టోబర్ 21,22,23), వాషింగ్టన్ డీసీ (అక్టోబర్ 24,25,26), శాన్ జోసె (అక్టోబర్ 28,29,30), ఎల్ఏ (అక్టోబర్ 31, నవంబర్ 1,2), టెక్సాస్, ఆస్టిన్ (నవంబర్ 4,5,6), డల్లాస్ (నవంబర్ 11,12,13), అట్లాంటా (నవంబర్ 14,15,16), డెట్రాయిట్ (నవంబర్ 18,19,20), ఇండియానా పాలిస్ (నవంబర్ 21,22) నగరాల్లో నిర్దేశించిన తేదీల్లో వ్రతాన్ని నిర్వహిస్తారు. ఈ వ్రతంలో పాల్గొనదలచిన వారు .www.satyanarayanavrataminusa.org లో రిజిస్టర్ చేసుకోవాలి..
l
l
Comments